Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టి20 ప్రపంచకప్ వేదికలు ఖరారు
ముంబయి: భారత్ వేదికగా అక్టోబర్లో జరిగే ఐసిసి టి20 ప్రపంచకప్ వేదికలను ఖరారుతోపాటు టోర్నమెంట్లో పాల్గొనే పాకిస్తాన్ ఆటగాళ్లకు వీసాలకు లైన్ క్లియర్ అయ్యింది. భారత్ వేదికగా అక్టోబర్లో జరగనున్న టి20 ప్రపంచకప్లో ఆడేందుకు వచ్చే పాక్ ఆటగాళ్లకు వీసాలు మంజూరుకు బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ శనివారం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ హామీ ప్రకారం పాక్ క్రికెటర్లకు వీసాలు మంజూరు అవుతాయని బోర్డు సెక్రటరీ జే షా కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు. టి20 కప్ నిర్వహణపై బోర్డు కౌన్సిల్ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం జరిగింది. ఇందులో మెగా టోర్నీ వేదికల ఖరారుతోపాటు పాకిస్తాన్ క్రికెటర్లకు భారత వీసాలు ఇచ్చే అంశంపై ఐసిసికి హామీ ఇచ్చినట్లు జే షా తెలిపారు. అయితే పాక్ ఫ్యాన్స్ ఇక్కడకు వచ్చి మ్యాచ్లను వీక్షించే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదన్నారు. తొమ్మిది వేదికల్లో టోర్నీని నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించామని, అహ్మదాబాద్లో కొత్తగా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందన్నారు. లీగ్ మ్యాచ్లు ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, ధర్మశాలలో జరగనున్నట్లు జే షా వీడియో కార్ఫరెన్స్లో తెలిపారు.