Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి చేతిలో 13పరుగులతో పరాజయం
చెన్నై: ఇండియన్ ప్రిమియర్‌లీగ్(ఐపిఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో పరాజయాన్ని చవిచూసింది. శనివారం ముంబయి ఇండియన్స్ చేతిలో 13 పరుగుల తేడాతో ఓడింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ 19.4 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో సన్ రైజర్స్ జట్టు ఈ సీజన్లో వరుసగా మూడో ఓటమిని చవిచూసింది.
తొలుత ముంబయి పవర్ ప్లేలో ఓవర్లలో ఓపెనర్లు రోహిత్ శర్మ(32; 25 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), క్వింటన్ డికాక్(40; 39బంతుల్లో 5ఫోర్లు) ధాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో 6ఓవర్లలోనే ముంబయి వికెట్లేమీ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. ఆ దశలో సన్ రైజర్స్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్.. రోహిత్ శర్మను అవుట్ చేసి ముంబయి వేగానికి బ్రేకులు వేశాడు. ఈ క్రమంలో ముంబయి 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసి భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. ఆ తర్వాత సూర్యకుమార్ కూడా ఔట్ కావడంతో సన్ రైజర్స్ బౌలర్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఈ క్రమంలో ముంబయి బ్యాట్స్‌మన్ పరుగులు చేయడానికి ఇబ్బందిపడ్డారు. ఇషాన్ కిషన్(12), హార్దిక్ పాండ్యా(7) వెంటవెటనే అవుట్ కావడంతో ముంబయి కష్టాల్లో పడింది. చివర్లో కీరన్ పొలార్డ్(35; 22 బంతుల్లో.. 1ఫోర్, 3సిక్స్‌లు) కొద్దిగా బ్యాట్ ఝుళిపించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. ముజీబ్, విజయ్ శంకర్‌కు రెండేసి, ఖలీల్ అహ్మద్‌కు ఓ వికెట్ దక్కాయి. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ ఓపెనర్లు వార్నర్(36), బెయిర్‌స్టో(43) రాణించడంతో 7.2 ఓవర్లలో 67 పరుగులు చేశారు. వీరిద్దరి నిష్క్రమణ అనంతరం విజయ్ శంకర్(28) మినహా జట్టును ఆదుకొనే మరో బ్యాట్స్‌మన్ కరువయ్యాడు. దీంతో సన్ రైజర్స్ 19.4 ఓవర్లలో 137 కుప్పకూలింది. బౌల్ట్, రాహుల్ చాహర్‌కు మూడేసి, కృనాల్, బుమ్రాకు ఒక్కో వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు..
ముంబయి ఇండియన్స్: డికాక్ (సి సబ్) సుచిత్ (బి)ముజీబ్ 40, రోహిత్ (సి)విరాట్ సింగ్ (బి)విజయ్ శంకర్ 32, సూర్యకుమార్ (సి అండ్ బి) విజయ్ శంకర్ 10, ఇషన్ కిషన్ (సి)బెయిర్‌స్టో (బి)ముజీబ్ 12, పొలార్డ్ (నాటౌట్) 35, హార్దిక్ (సి)విరాట్ సింగ్ (బి)ఖలీల్ 7, కృనాల్ (నాటౌట్) 3, అదనం 11. (20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 150 పరుగులు.
వికెట్ల పతనం: 1/55, 2/71, 3/98, 4/114, 5/131
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-45-0, ఖలీల్ అహ్మద్ 4-0-24-1, ముజీబ్ 4-0-29-2, అభిషేక్ శర్మ 1-0-5-0, విజయ్ శంకర్ 3-0-19-2, రషీద్ 4-0-22-0.
సన్ రైజర్స్: వార్నర్ (రనౌట్) హార్దిక్ 36, బెయిర్‌స్టో (హిట్‌వికెట్)బి) కృనాల్ 43, మనీష్ (సి)పొలార్డ్ (బి)రాహుల్ చాహర్ 2, విరాట్ సింగ్ (సి)సూర్యకుమార్ (బి)రాహుల్ చాహర్ 11, విజయ్ శంకర్ (సి)సూర్యకుమార్ (బి)బుమ్రా 28, అభిషేక్ (సి)విల్నే (బి)రాహుల్ చాహర్ 2, సమద్ (రనౌట్) హార్దిక్ 7, రషీద్ (ఎల్బి)బౌల్ట్ 0, భువనేశ్వర్ (బి)బౌల్ట్ 1, ముజీబ్ (నాటౌట్) 1, ఖలీల్ (బి)బౌల్ట్ 1, అదనం 5. (19.4 ఓవర్లలో) 137 ఆలౌట్.
వికెట్ల పతనం: 1/67, 2/71, 3/90, 4/102, 5/104, 6/129, 7/130, 8/134, 9/135, 10/137.
బౌలింగ్: 9.4-0-28-3, బుమ్రా 4-0-14-1, మిల్నే 3-0-33-0, కృనాల్ 3-0-30-1, రాహుల్ చాహర్ 4-0-19-3, పొలార్డ్ 2-0-10-0.