Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టస్కెంట్(ఉజ్బెకిస్తాన్): భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజన్ ఉజ్బెకిస్తాన్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో జాతీయ రికార్డును నెలకొల్పాడు. శనివారం రాత్రి జరిగిన ఫినా అక్రిడిటెడ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ 50మీ. బ్యాక్‌స్ట్రోక్ స్మిమ్మింగ్‌లో బెంగళూరుకు చెందిన 20ఏళ్ల శ్రీహరి 25.11సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణపతకం గెల్చుకున్నాడు. ఒలింపిక్ 'ఏ' క్వాలిఫికేషన్ అర్హత మార్క్‌కు 0.22 దూరంలో నిలిచాడు. మహిళల విభాగంలో మాన పటేల్, సువన భాస్కర్ 30.28సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ, రజిత పతకాలు గెలిచారు. ఈ ఛాంపియన్‌షిప్‌లోనే శ్రీహరి 100మీ. బ్యాక్స్స్ట్రోక్లో 54.07సెకన్లలో గమ్యానికి చేరి ఇంతకుముందే ఒక స్వర్ణం గెల్చుకోగా.. పర్సనల్ బెస్ట్ 54.10సెకన్ల జాతీయ రికార్డును తిరగరాసాడు. ఇక సజన్ ప్రకాశ్ నాలుగు స్వర్ణాలను గెలుపొందగా.. 100మీ. బటర్‌ఫ్లైలో 53.69సెకన్లలో గమ్యానికి చేరాడు. 200మీ. బటర్‌ఫ్లైలో సాజన్ 1.57.85సెకన్లలో గమ్యానికి చేరగా.. ఒలింపిక్ 'ఏ' అర్హత మ్యార్ 1.56.48సె. కొద్దిదూరంలో నిలిచాడు. ఒలింపిక్స్ అర్హత సాధించేందుకు భారత్‌నుంచి సాజన్, శ్రీహరి, ఖాడే, రావత్, మఖిజ, అద్వైత్ 'బి' స్టాండర్డ్ ఆయా కేటగిరీల్లో పోటీపడుతున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత స్విమ్మర్లు సత్తా చాటారు. భారత్ 18 స్వర్ణ, 7 రజిత, 4కాంస్యాలతో సహా మొత్తం 29 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.