Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్మట్టి(కజకిస్తాన్): ఇక్కడ జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పురుషుల సీనియర్ విభాగంలో భారత్‌కు మరో రెండు పతకాలు దక్కాయి. ఆదివారం జరిగిన 86కిలోల ఫ్రిస్టైల్ ఫైనల్లో దీపక్ పునియా ప్రపంచ, ఒలింపిక్ ఛాంపియన్ హసన్ యగ్దాని(కజకిస్తాన్) చేతిలో పోరాడి ఓడాడు. చాలాకాలం తర్వాత వీరిద్దరూ ఫైనల్లో తలపడడం ఇదే ప్రథమం. ఫైనల్‌కు చేరే క్రమంలో దీపక్ 9-2తో ఉజ్బెకిస్తాన్, 4-3తో తజకిస్తాన్ రెజ్లర్లను చిత్తుచేశాడు. ఇక సెమీస్‌లో 2-0తో కొరియాకు చెందిన గానుక్ కిమ్‌ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్లో టాప్‌సీడ్ చేతిలో 10-0పాయింట్లతో ఓడి రజితానికే పరిమితమయ్యాడు. ఇక 92కిలోల విభాగంలో సంజీత్ కాంస్య పతకం గెలిచాడు. నేటితో ముగిసిన రెజ్లింగ్ పోటీల్లో భారత్ 5స్వర్ణ, 3రజిత, 6కాంస్య పతకాలను గెల్చుకుంది.