Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్‌కతాపై 38 పరుగుల తేడాతో బెంగళూరు గెలుపు
- మ్యాక్స్‌వెల్ అర్ధసెంచరీ, జెమీసన్‌కు మూడు వికెట్లు
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 38పరుగుల తేడాతో బెంగళూరు గెలిచింది. తొలుత మ్యాక్స్‌వెల్(78), డివిలియర్స్(76) విధ్వంస ఇన్నింగ్స్ ఆడడంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులే చేసి పరాజయాన్ని చవిచూసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ కోహ్లి(5), రజత్ పడీదర్(1) ఘోరంగా విఫలమయ్యారు. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్(25) కాస్త ఫర్వాలేదనిపించడంతో బెంగళూరు 11.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. పడిక్కల్ నిష్క్రమణ అనంతరం విధ్వంస ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్ ఝుళిపించడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. డివిలియర్స్(76నాటౌట్; 34బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు) భీకర ఇన్నింగ్స్‌కి తోడు.. మ్యాక్స్‌వెల్(78; 49 బంతుల్లో 9ఫోర్లు, 3సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి రెండు, పాట్ కమిన్స్, ప్రసిద్ధ్ కృష్ణకు చెరో వికెట్ దక్కాయి. లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఓపెనర్ నితీష్ రాణా(18), శుభ్‌మన్(21) తొలుత ఫర్వాలేదనిపించారు. చివర్లో రస్సెల్(31) మెరుపులు మెరిపించాలని చూపినా.. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 166 పరుగులే చేయగల్గింది. జెమీసన్‌కు మూడు, చాహల్, హర్షల్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డివిలియర్స్‌కు దక్కింది.
స్కోర్‌బోర్డు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (సి)త్రిపాఠి (బి)చక్రవర్తి 5, పడిక్కల్ (సి)త్రిపాఠి (బి)ప్రసిధ్ 25, రజత్ పటిదర్ (బి)చక్రవర్తి 1, మ్యాక్స్‌వెల్ (సి)హర్భజన్ (బి)కమ్మిన్స్ 78, డివిలియర్స్ (నాటౌట్) 76, జెమీసన్ (నాటౌట్) 11, అదనం 8. (20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 204 పరుగులు.
వికెట్ల పతనం: 1/6, 2/9, 3/95, 4/148
బౌలింగ్: హర్భజన్ 4-0-38-0, చక్రవర్తి 4-0-39-2, షకీబ్ 2-0-24-0, కమ్మిన్స్ 4-0-34-1, ప్రసిధ్ 4-0-31-1, రసెల్ 2-0-38-0
కోల్‌కతా నైట్‌రైడర్స్: నితీష్ రాణా (సి)పడిక్కల్ (బి)చాహల్ 18, శుభ్‌మన్ (సి)సబ్ క్రిస్టియన్ (బి)జెమీసన్ 21, త్రిపాఠి (సి)సిరాజ్ (బి)సుందర్ 25, మోర్గాన్ (సి)కోహ్లి (బి)హర్షల్ 29, దినేశ్ కార్తీక్ (ఎల్బి)చాహల్ 2, షకీబ్ (బి)జెమీసన్ 26, రస్సెల్ (బి)హర్షల్ పటేల్ 31, కమ్మిన్స్ (సి)డివిలియర్స్ (బి)జెమీసన్ 6, హర్భజన్ (నాటౌట్) 2, చక్రవర్తి (నాటౌట్) 2, అదనం 4. (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 166 పరుగులు.
వికెట్ల పతనం: 1/28, 2/57, 3/66, 4/74, 5/114, 6/155, 7/161, 8/162
బౌలింగ్: సిరాజ్ 3-0-17-0 జెమీసన్ 3-0-41-3, చాహల్ 4-0-34-2, సుందర్ 4-0-33-1, మ్యాక్స్‌వెల్ 2-0-24-0, హర్షల్ పటేల్ 4-0-17-2.