Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధావన్ మెరుపులు
-పంజాబ్ కింగ్స్‌పై 7 వికెట్లతో గెలుపు
ముంబయి: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఛేదించింది. ఆదివారం ఐపిఎల్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. ఢిల్లీ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. శిఖర్ దావన్(92, 49 బంతుల్లో 13ఫోర్లు, 2 సిక్సర్లు) ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలకపాత్ర పోషించగా.. చివర్లో స్టోయినీస్, లలిత్ యాదవ్ మ్యాచ్‌ను ముగించారు.
తొలుత ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అర్ధసెంచరీలకి తోడు తొలి వికెట్‌కు 122 భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పంజాబ్ కింగ్స్ జట్టు 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(61; 51 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు), మయాంక్ అగర్వాల్(69; 36 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు) ధాటిగా ఆడి శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం జోడించారు. తర్వాత వచ్చిన క్రిస్‌గేల్(11), నికోలస్ పూరన్(9) విఫలమైనా.. దీపక్ హుడా(22), షారుఖ్‌ఖాన్(15) అజేయంగా క్రీజ్‌లో నిలవడంతో పంజాబ్ భారీస్కోర్‌ను చేసింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్‌వోక్స్, రబాడ, అవేశ్‌ఖాన్, మెరివాలాకు తలా ఓ వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఓవర్‌కు 10 రన్‌రేట్ తగ్గకుండా ఆడింది. ఈ క్రమంలో పవర్‌ప్లే 6 ఓవర్లు ముగిసేసరికి 62 పరుగులు చేసింది. ధావన్(92), పృథ్వీ షా(32) కలిసి తొలి వికెట్‌కు 5.3 ఓవర్లలో 59 పరుగులు జతచేశారు. ఆ తర్వాత స్మిత్(9), పంత్(15) నిరాశపరిచినా.. చివర్లో స్టొయినీస్(27), లలిత్ యాదవ్(12) మ్యాచ్‌ను ముగించారు. రిచర్డుసన్కు రెండు, ఆర్ష్‌దీప్, మెరెడిత్‌కు తలా ఒక వికెట్ దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శిఖర్ ధావన్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు..
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (సి)స్టోయినీస్ (బి)రబాడ 61, మయాంక్ (సి)ధావన్ (బి)మెరివాల 69, గేల్ (సి సబ్) రిపిల్ పటేల్) (బి) వోక్స్ 11, హుడా (నాటౌట్) 22, పూరన్ (సి)రబాడ (బి)అవేశ్ ఖాన్ 9, షారుక్ ఖాన్ (నాటౌట్) 15, అదనం 8. (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 195 పరుగులు.
వికెట్ల పతనం: 1/122, 2/141, 3/158, 4/179
బౌలింగ్: వోక్స్ 4-0-42-1, మెరివాలా 3-0-32-1, అశ్విన్ 4-0-28-0, రబాడ 4-0-43-1, లలిత యాదవ్ 1-0-11-0, అవేశ్ ఖాన్ 4-0-33-1.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (సి)గేల్ (బి)ఆర్ష్‌దీప్ 32, ధావన్ (సి)రిచర్డుసన్ 92, స్మిత్ (సి)రిచర్డుసన్ (బి)మెరిడిత్ 9, పంత్ (సి)హుడా (బి)రిచర్డుసన్ 15, స్టొయినీస్ (నాటౌట్) 23, లలిత్ యాదవ్ (నాటౌట్) 12, అదనం 11. (18.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 199 పరుగులు.
వికెట్ల పతనం: 1/59, 2/107, 3/152, 4/180
బౌలింగ్: ఆర్ష్‌దీప్ 3-0-22-1, షమీ 4-0-53-1, సక్సేనా 3-0-27-0, రిచర్డుసన్ 4-0-41-2, హుడా 2-0-18-0, మెరెడిత్ 1.2-0-35-1.