Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : ఒలింపిక్స్‌కు స్వదేశీ ప్రేక్షకుల అనుమతిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. జపాన్ స్థానికపత్రిక మెయినిచి మంగళవారం ప్రచురించిన కథనంలో జూన్‌లో ప్రేక్షకుల అనుమతిపై నిర్వాహకులు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. విదేశీ ప్రేక్షకులెవ్వరికీ అనుమతివ్వడం లేదని మార్చిలోనే నిర్వాహకులు ప్రకటించినా... కేవలం స్థానిక ప్రేక్షకుల మధ్యే ఈసారి ఒలింపిక్స్ జరుగుతాయని తెలిపారు. కానీ అధికారికంగా ఇప్పటికీ ఎలాంటి అనుమతినివ్వలేదు. గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ కోవిడ్-19 కారణంగా ఈ ఏడాదికి వాయిదాపడ్డ విషయం తెలిసిందే. మార్చిలో జరిగిన 2020 ఒలింపిక్స్ నిర్వాహకుల సమావేశంలో ప్రస్తుతానికి పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదని, ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఒలింపిక్స్‌కు ప్రేక్షకులకు అనుమతిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడంతో అంత మంచిది నిర్ణయం కాదని వారు అభిప్రాయపడినట్లు తెలిసింది. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, పారాలింపిక్ కమిటీ ప్రేక్షకుల అనుమతిపై ఓ కొలిక్కి రాలేదని ఆ పత్రిక కథనంలో పేర్కొంది.