Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(డబ్ల్యుటిసి)ఫైనల్ సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్మండలి(ఐసిసి) మంగళవారం స్పష్టం చేసింది. భారత్లో కరోనా తీవ్రస్థాయిలో ఉండటంతో ఇండియా నుంచి రాకపోకలపై బ్రిటీష్ ప్రభుత్వం నిషేధం విధిస్తూ 'రెడ్ లిస్ట్'లో చేర్చింది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లను సురక్షిత వాతావరణంలో ఎలా నిర్వహించాలో ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసిబి) ఇప్పటికే నిరూపించాయని, డబ్ల్యూటిసి ఫైనల్ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతుందని ఐసిసి ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్స్ భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రిమియర్లీగ్(ఐపిఎల్)లో ఇరుజట్ల ఆటగాళ్ళు ఉండగా.. మే 30తో ఐపిఎల్ ముగియనుంది. అనంతరం భారత్-న్యూజిలాండ్ ఆటగాళ్ళు జూన్ 2న లార్డ్కు వెళ్లి 10రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది.