Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరూ షూటర్లకూ పాజిటివ్
- నేషనల్ క్యాంప్ రద్దు
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్ సిమ్రన్‌జిత్ కరోనా పాజిటివ్ వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొనసాగనున్న ఒలింపిక్ అర్హత సాధించిన మహిళల జాతీయ శిబిరం వాయిదా పడింది. శిబిరంలో ఉన్న పూజారాణి , లావ్లినా బోర్గోహిన్లను ఇండ్లకు పంపారు. అలాగే ఒలింపిక్స్ కోసం ప్రకటించిన షూటింగ్ స్క్వాడ్‌లోని ఇద్దరు షూటర్లు కరోనా బారిన పడ్డారు. 19 నుంచి ప్రారంభం కావాల్సిన శిబిరాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
21 మంది బాక్సర్లకు కరోనా సోకిన తర్వాత.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సిమ్రన్‌జిత్ కౌర్, మహిళల హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ రాఫెల్ బెర్గామాస్కో, హెడ్ కోచ్ అలీ కమర్, పూజ్రానీ, లోవ్లినా బోర్గోహిన్ తో సహ ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మేరీ కోమ్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి మార్చారు. ఒలింపిక్ సన్నాహాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
సిమ్రన్‌జిత్ కౌర్ కు మాత్రమే పాజిటివ్ రిపోర్టు కాగా..మిగతా బాక్సర్లకు నెగెటివ్ రిపోర్టు వచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ముందస్తు చర్యల్లో భాగంగా నేషనల్ క్యాంప్ రద్దు చేశామని అధికారులు చెబుతున్నారు.
తొలిసారిగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొమ్మిది మంది బాక్సర్లు
టోక్యో ఒలింపిక్స్‌కు తొలిసారిగా తొమ్మిది మంది బాక్సర్లు అర్హత సాధించారు. వీరిలో నలుగురు మహిళా బాక్సర్లు ఉన్నారు. వీరిలో మేరీ కోమ్, పూజా రాణి, సిమ్రన్‌జిత్ కౌర్, లావ్లినా బోర్గోహిన్. ఉన్నారు. పురుష విభాగంలో అమిత్ పంగల్, వికాస్ కృష్ణ, ఆశిష్ కుమార్, సతీష్ కుమార్, మనీష్ కౌశిక్ ఉన్నారు.
అయితే వచ్చే నెల మొదటివారంలో షూటర్లందర్నీ ఢిల్లీకి పిలువనున్నారు. పదిరోజుల నిర్బంధం తర్వాత క్రొయేషియాలో శిక్షణకు పంపనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.