Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపు
చెన్నై: ఇండియన్ ప్రిమియర్‌లీగ్(ఐపిఎల్)లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను చిత్తుచేసింది. తొలుత అమిత్ మిశ్రా(4/24), యువ పేసర్ ఆవేశ్ ఖాన్(2/15) బౌలింగ్‌లో చేలరేగడంతో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేయగల్గింది. అనంతరం ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసి గెలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ క్వింటన్ డికాక్(1).. స్టొయినీస్ ఓవర్ తొలి బంతికే రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత రోహిత్-సూర్యకుమార్ యాదవ్ కలిసి రెండో వికెట్‌కు 58 పరుగులు జతచేశారు. అశ్విన్ వేసిన నాలుగో ఓవర్లో యాదవ్ ఒక ఫోర్ కొట్టగా.. రోహిత్ ఫోర్, సిక్సర్ బాదడంతో ఆ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత రబాడ బౌలింగ్‌లోనూ 14 పరుగులు రాబట్టారు. దీంతో పవర్‌ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి ముంబయి వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్ దూకుడుగా ఆడుతుండటంతో ముంబయి భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఈ దశలో సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మిశ్రా మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించి ముంబయిని దెబ్బకొట్టాడు. 9వ ఓవర్లో రోహిత్, హార్దిక్ పాండ్యను మిశ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత స్టార్ బ్యాట్స్‌మన్ పొలార్డ్‌ను ఎల్‌బిగా ఔట్ చేయడంతో ముంబయి ఒక్కసారిగా తడబడింది. స్పిన్నర్లు టాప్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఆట కట్టించారు. చివర్లో నిలకడగా ఆడుతున్న ఇషాన్‌ను మిశ్రా పెవిలియన్ పంపాడు. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా స్టాయినీస్, రబాడ, లలిత్ యాదవ్ తలో వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ బ్యాట్స్మన్లు భారీషాట్లకు పోకుండా నిదానంగా ఆడారు. పృథ్వీ షా(7) త్వరగా పెవీలియన్‌కు చేరినా.. ధావన్(45), స్మిత్(33) రెండో వికెట్‌కు 53 పరుగులు జతచేశారు. ఆ తర్వాత లలిత్ యాదవ్(22) క్రీజ్‌లో ఆచి తూచి ఆడగా.. హెట్మెయిర్(14) మ్యాచ్‌ను ముగించాడు. జయంత్, బుమ్రా, రాహుల్ చాహర్, పొలార్డ్‌కు తలా ఒక వికెట్ దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అమిత్ మిశ్రాకు దక్కింది.
స్కోర్‌బోర్డు..
ముంబయి ఇండియన్స్: రోహిత్ (సి)స్మిత్ (బి)మిశ్రా 44, డికాక్ (సి)పంత్ (బి)స్టోయినీస్ 1, సూర్యకుమార్ (సి)పంత్ (బి)ఆవేశ్ ఖాన్ 24, ఇషన్ కిషన్ (బి)మిశ్రా 26, హార్దిక్ (సి)స్మిత్ (బి)మిశ్రా 0, కృనాల్ పాండ్యా (బి)లలిత్ యాదవ్ 1, పొలార్డ్ (ఎల్బి)మిశ్రా 2, జయంత్ యాదవ్ (సి అండ్ బి) రబాడ 23, రాహుల్ చాహర్ (సి)పంత్ (బి)ఆవేశ్ ఖాన్ 6, బుమ్రా (నాటౌట్) 3, బౌల్ట్ (నాటౌట్) 1, అదనం 6. (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 137 పరుగులు.
వికెట్ల పతనం: 1/9, 2/67, 3/76, 4/77, 5/81, 6/84, 7/123, 8/129, 9/135
బౌలింగ్: స్టోయినీస్ 3-0-20-1, అశ్విన్ 4-0-30-0, రబాడ 3-0-25-1, మిశ్రా 4-0-24-4, ఆవేశ్ ఖాన్ 2-0-15-2, లలిత్ యాదవ్ 4-0-17-1.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (సి అండ్ బి) జయంత్ 7, ధావన్ (సి)కృనాల్ (బి)రాహుల్ చాహర్ 45, స్మిత్ (ఎల్బి) పొలార్డ్ 33, లలిత్ యాదవ్(నాటౌట్) 22, పంత్ (సి)కృనాల్ (బి)బుమ్రా 7, హెట్మెయిర్ (నాటౌట్) 14, అదనం 10. (19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 138 పరుగులు.
వికెట్ల పతనం: 1/11, 2/64, 3/100, 4/115
బౌలింగ్: బౌల్ట్ 4-0-23-0, జయంత్ యాదవ్ 4-0-25-1, బుమ్రా 4-0-32-1, కృనాల్ పాండ్యా 2-0-17-0, రాహుల్ చాహర్ 4-0-29-1, పొలార్డ్ 1.1-0-9-1.