Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాదేశ్ 302/2
పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్‌లో పర్యాటక బంగ్లాదేశ్ జట్టు భారీస్కోర్ దిశగా దూసుకెళ్తోంది. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలిటెస్ట్‌లో బుధవారం టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా తొలిరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఓపెనర్ సైఫ్(0) నిరాశపర్చినా.. మరో ఓపెనర్ తమీమ్(90), నజ్ముల్(126నాటౌట్) రెండో వికెట్‌కు 144 పరుగులు జతచేశారు. ఆ తర్వాత తమీమ్‌ను ఫెర్నాండో ఔట్ చేసినా.. కెప్టెన్ మోమినుల్ హక్(64నాటౌట్)అర్ధసెంచరీతో ఆదుకోవడంతో బంగ్లాజట్టు భారీస్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఫెర్నాండోకు రెండు వికెట్లు దక్కాయి.