Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతజట్టు మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ కిరణ్ మోరే కరోనానుంచి కోలుకున్నాడు. కోవిడ్-19న బారిన పడి క్వారంటైన్లో ఉన్న కిరణ్ మోరేకు తాజాగా జరిపిన పరీక్షల్లో నెగటివ్ వచ్చినట్లు ముంబయి ఇండియన్స్ ప్రకటించింది. దీంతో బయో-బబుల్ పూర్తయిన వెంటనే ఇండియన్ ప్రిమియర్‌లీగ్(ఐపిఎల్)లో ముంబయి జట్టుతో కలవనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. 'కిరణ్ మోరే కోవిడ్ బారినుంచి కోలుకున్నాడని, తాజాగా జరిపిన ఆర్టి-పిసిఆర్ టెస్ట్‌ల్లో నెగెటివ్ రిపోర్టు వచ్చిందని ముంబయి ఇండియన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 6న ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు, సహాయ సిబ్బందికి జరిపిన పరీక్షల్లో మోరేకి పాజిటివ్ తేలింది.