Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒత్తిళ్లమధ్య యూరోపియన్ సూపర్ లీగ్ నిర్వహించలేం
- ఫౌండర్ అగెల్లీ
మిలన్: యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్(యుఇఎఫ్ఏ)కు పోటీగా ఆవిర్భవించిన యూరోపియన్ సూపర్‌లీగ్(ఈఎస్ఎల్) వెనక్కి తగ్గింది. తీవ్ర రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఈఎస్ఎల్ను నిర్వహించలేమని ఫౌండర్, జువెంటస్ క్లబ్ చైర్మన్ ఆండ్రియా అగెల్లీ బుధవారం స్పష్టం చేశారు. లీగ్ ప్రారంభానికి ముందే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ బెదిరింపులకు దిగడం, ఫిఫా ఆటగాళ్లపై నిషేధం విధిస్తానని బహిరంగంగా ప్రకటించడం వల్లే ఆ క్లబ్‌లు వెనక్కి తగ్గాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈఎస్ఎల్ను నిర్వహించలేమని, నిజాయితీగా చెప్పాలంటే 'ఆ పని చేయలేను' అని అన్నారు. సూపర్‌లీగ్‌ను ప్రారంభిస్తానని ప్రకటించినందుకు తానేమీ బాధపడడంలేదని, యుఇఎఫ్ఏకు మార్పు అవసరమన్నారు. ఈఎస్ఎల్ ప్రారంభమైతే ప్రపంచంలోనే బెస్ట్ లీగ్ అయ్యేదని, ఆరు క్లబ్‌లు వెనక్కి తగ్గడంతో ఎన్నో క్లబ్‌లు తాము లీగ్‌లో చేరతామని ఆమోదం తెలియని, వాటి పేర్లు తాను చెప్పదలచుకోలేదన్నారు. నూతన లీగ్‌లో పాల్గొంటామని ఆమోదం తెలిపిన ఆరు ఇంగ్లీష్ క్లబ్‌లు ఆర్సెనెల్, చెల్సీ, లివర్‌పూల్, మాంచెస్టర్ సిటీ, మాంచెస్టర్ యునైటెడ్, టోటెన్హామ్ క్లబ్‌లు వెనక్కి తగ్గడంతో అగెల్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు.