Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్‌పై 9వికెట్ల తేడాతో ఘన విజయం
చెన్నై: వరుస ఓటముల అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయాన్ని సాధించింది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలిగా బ్యాటింగ్‌కు దిగినా.. సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు 19.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. ఖలీల్(3/21), అభిషేక్(2/24)కి తోడు రషీద్‌ఖాన్, సిద్ధార్ద్ కౌల్, భువనేశ్వర్ బౌలింగ్‌లో మెరిసారు. అనంతరం సన్‌రైజర్స్ 18.4ఓవర్లలో వికెట్ నష్టానికి 121 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. వార్నర్(37), బెయిర్‌స్టో(63నాటౌట్), విలియమ్సన్(16నాటౌట్) సరన్రైజర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించారు.
టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్(4)ను భువనేశ్వర్ కుమార్ త్వరగా పెవీలియన్‌కు పంపేశాడు. అనంతరం సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పంజాబ్ జట్టు పరుగులు రాబట్టేందుకు ఇబ్బందిపడింది. దాంతో పంజాబ్ ఈ సీజన్లో అత్యల్ప స్కోరు నమోదుచేసిన జట్టుగా నిలిచింది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (22), షారుఖ్ ఖాన్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఖలీల్‌కు మూడు, అభిషేక్‌కు రెండు వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఓపెనర్లు వార్నర్(37), బెయిర్‌స్టో(63నాటౌట్) తొలి వికెట్‌కు 10 ఓవర్లలో 73 పరుగులు జతచేశారు. ఆ తర్వాత వార్నర్ ఔటైనా.. బెయిర్‌స్టో, ఐపిఎల్ ఆరంభ మ్యాచ్ ఆడుతున్న విలియమ్సన్ మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. పంజాబ్ బౌలర్ అలెన్‌కు ఒక వికెట్ లభించింది. దీంతో ఐపిఎల్ 14వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెయిర్‌స్టోకు దక్కింది.
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (సి)కేదర్ జాదవ్ (బి)భువనేశ్వర్ 4, మయాంక్ అగర్వాల్ (సి)రషీద్ (బి)ఖలీల్ 22, గేల్ (ఎల్బి) రషీద్ 15, పూరన్ (రనౌట్)వార్నర్ 0, దీపక్ హుడా (ఎల్బి)అభిషేక్ శర్మ 13, హెన్రిక్స్ (స్టంప్)బెయిర్‌స్టో (బి)అభిషేక్ 14, షారుక్ ఖాన్ (సి)అభిషేక్ (బి)ఖలీల్ 22, ఫాబియన్ అలెన్ (సి)వార్నర్ (బి)ఖలీల్ అహ్మద్ 6, మురుగన్ అశ్విన్ (సి)బెయిర్‌స్టో (బి)కౌల్ 9, షమీ (రనౌట్)విజరు శంకర్/బెయిర్‌స్టో 3, ఆర్ష్‌దీప్ సింగ్ (నాటౌట్) 1, అదనం 11. (19.4 ఓవర్లలో ఆలౌట్) 120పరుగులు.
వికెట్ల పతనం: 1/15, 2/39, 3/39, 4/47, 5/63, 5/63, 6/82, 7/101, 8/110, 9/114, 10/120
బౌలింగ్: అభిషేక్ శర్మ 4-0-24-2, భువనేశ్వర్ 3-0-16-1, ఖలీల్ అహ్మద్ 4-0-21-3, సిద్దార్ద్ కౌల్ 3.4-0-27-1, విజరు శంకర్ 1-0-6-0, రషీద్ ఖాన్ 4-0-17-1.
సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (సి)మయాంక్ (బి)అలెన్ 37, బెయిర్‌స్టో (నాటౌట్) 63, విలియమ్సన్ (నాటౌట్) 16, అదనం 5. (18.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 121 పరుగులు.
వికెట్ల పతనం: 1/73
బౌలింగ్: షమీ 2-0-16-0, అలెన్ 4-1-22-1, ఆర్ష్‌దీప్ సింగ్ 3.4-0-31-0, హెన్రిక్స్ 1-0-7-0, మురుగన్ అశ్విన్ 4-0-22-0, హుడా 4-0-22-0.