Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాడి ఓడిన కోల్‌కతా
- 18 పరుగుల తేడాతో చెన్నై గెలుపు
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) చెన్నై-కోల్‌కతా జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్మన్ల హవా కొనసాగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 18 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. చెన్నై జట్టులో డుప్లెసిస్(95నాటౌట్), గైక్వాడ్(64) చెలరేగి ఆడడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీస్కోర్ నమోదు చేసింది. అనంతరం కోల్‌కతా 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా.. అనంతరం రస్సెల్(54), కమ్మిన్స్(56), దినేశ్ కార్తీక్(40) చెలరేగడంతో చెన్నై చివరి ఓవర్‌వరకు లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించినా.. 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది.
తొలిగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మన్లు అదరగొట్టారు. ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్(64; 42 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లు), డూ ప్లెసిస్(95; 60బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సలు) తొలి వికెట్‌కు(115 పరుగులు)సెంచరీ భాగ స్వామ్యం నెలకొల్పారు. గైక్వాడ్ ఔటైన తర్వాత క్రీజులోకొచ్చిన మొయిన్ అలీ(25; 12బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే నరైన్ ఓ మ్యాజిక్ బాల్‌తో అలీని ఔట్ చేశాడు. అలీ తర్వాత కెప్టెన్ ధోనీ(17) కూడా బ్యాటు ఝుళిపించాడు. కానీ రస్సెల్ ఓ ఆఫ్ స్టంప్ ఔట్ సైడ్ డెలివరీని బౌండరీ కొట్టబోగా.. షార్ట్ కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న మోర్గాన్ డైవ్ క్యాచ్ అందుకోవడంతో ఔటయ్యాడు. చివరి ఓవర్లో డూప్లెసిస్(95నాటౌట్) తటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, కమిన్స్‌కు తలా ఓ వికెట్ దక్కాయి. లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఐదు వికెట్లను త్వరగా కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్‌ప్లే ఓవర్లలోనే రస్సెల్ బ్యాటింగ్‌కు దిగడంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. రస్సెల్(54; 24 బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సర్లు), కమ్మిన్స్(66నాటౌట్; 34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు), దినేశ్ కార్తీక్(40; 24 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) విధ్వంస ఇన్నింగ్ ఆడారు. ఈ క్రమంలో కోల్‌కతా చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సి వచ్చింది. కమ్మిన్స్.. శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి బంతిని బౌండరీకి దగ్గరకు తరలించినా.. 2 పరుగులు తీసే క్రమంలో ప్రసిధ్ కృష్ణ రనౌటవ్వడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ 202 పరుగుల వద్ద ముగిసింది. దీపక్ చాహర్‌కు నాలుగు, ఎన్గిడికి మూడు వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు..
చెన్నై సూపర్‌కింగ్స్: గైక్వాడ్ (సి)కమ్మిన్స్ (బి)చక్రవర్తి 64, డుప్లెసిస్ (నాటౌట్) 95, మొయిన్ అలీ (స్టంప్) కార్తీక్ (బి)నరైన్ 25, ధోనీ (సి)మోర్గాన్ (బి)రస్సెల్ 17, జడేజా (నాటౌట్) 6, అదనం 13. (20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 220 పరుగులు.
వికెట్ల పతనం: 1/115, 2/165, 3/201
బౌలింగ్: చక్రవర్తి 4-0-27-1, కమ్మిన్స్ 4-0-58-0, నరైన్ 4-0-34-1, ప్రసిధ్ 4-0-49-0, రస్సెల్ 2-0-27-1, నాగర్కోటి 2-0-25-0
కోల్‌కతా నైట్‌రైడర్స్: నితీష్ రాణా (సి) ధోనీ (బి)దీపక్ చాహర్ 9, శుభ్‌మన్ (సి)ఎన్గిడి (బి)దీపక్ చాహర్ 0, త్రిపాఠి (సి)ధోనీ (బి)ఎన్గిడి 8, మోర్గాన్ (సి)ధోనీ (బి)దీపక్ చాహర్ 7, నరైనా (సి)జడేజా (బి)దీపక్ చాహర్ 4, దినేశ్ కార్తీక్ (ఎల్బి)ఎన్గిడి 40, రస్సెల్ (బి)శామ్ కర్రన్ 54, కమ్మిన్స్ (నాటౌట్) 66, నాగర్కోటి (సి)డుప్లెసిస్ (బి)ఎన్గిడి 0, చక్రవర్తి (రనౌట్) చాహర్/శామ్ కర్రన్ 0, ప్రసిధ్ కృష్ణ (రనౌట్) చాహర్/శార్దూల్ 0, అదనం 14. (19.1 ఓవర్లలో ఆలౌట్) 202 పరుగులు.
వికెట్ల పతనం: 1/1, 2/17, 3/27, 4/31, 5/31, 6/112, 7/146. 8/176, 9/200, 10/202
బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-29-4, శామ్ కర్రన్ 4-0-58-1, ఎన్గిడి 4-0-28-3, జడేజా 4-0-33-0, శార్దూల్ 3.1-0-48-0