Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : ప్రస్తుతం సాగుతున్న టోక్యో ఒలింపిక్స్ టార్చ్ రిలేలో తొలి కోవిడ్ కేసు నమోదయింది. ఈ నెల 17న కవగా జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ కోసం నియమించిన ఒక పోలీసుకు కోవిడ్ నిర్ధారణ అయినట్లు నిర్వహకులు గురువారం ప్రకటించారు. సదరు పోలీస్ వ్యక్తి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించినట్లు తెలిపారు. మార్చి 25న ఫుకుషిమా జిల్లా నుంచి ఈ టార్చ్ రిలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రిలేకు తాజాగా నమోదైన కోవిడ్ కేసు ఎలాంటి అంతరాయం కలిగించదని నిర్వహకులు స్పష్టం చేశారు.