Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గురువారం మధ్యహ్నం మొయినాబాద్లో వీరి వివాహం జరిగింది. కరోనా నిబంధనల కారణంగా సన్నిహిత బంధువులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హజరయ్యారు. కొన్ని ఏళ్ళ నుంచి వీరు ప్రేమలో ఉన్నారు. గతేడాది సెప్టెంబర్లో వీరి నిశ్చితార్థం జరిగింది.