Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించారు. బుధవారం వాంఖడే వేదికగా చెన్నైతో మ్యాచ్‌లో కోల్‌కతా నిర్ణీత సమయంలోపు ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. దీంతో ఐపిఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద మోర్గాన్‌కు రూ.12లక్షల జరిమానా విధించారు. ఇప్పటికే చెన్నై కెప్టెన్ ధోనీ, ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మలకు స్లో ఓవర్ రేట్‌తో జరిమానా విధించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం..ప్రతి జట్టు 90 నిమిషాలలోపు 20 ఓవర్లను పూర్తిచేయాలి.