Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : త్వరలో జరిగే ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నంట్ కోసం ప్రకటించిన భారత జట్టును గురువారం ప్రకటించారు. ఈ జట్టులో సుశీల్ కుమార్‌కు స్థానం లభించకపోడంపై సంచలనంగా మారింది. బల్గేరియాలోని సోఫియాలోని ఈ టోర్ని మే 6-9 తేదీల్లో జరగనుంది. టోక్యో ఒలింపిక్స్‌కు ఆర్హత సాధించడానికి ఇదే చివరి టోర్ని. దీంతో భారత జట్టులో మాజీ ఒలింపిక్ విజేత సుశీల్‌కు స్థానం దక్కకపోవడంతో టోక్యో ఒలింపిక్స్‌కు అతను అవకాశం కోల్పోయినట్లేనని విశేష్లకులు భావిస్తున్నారు. గురువారం ప్రకటించిన భారత జట్టులో ఫ్రీస్టయిల్ విభాగంలో అమిత్ ధకంర్ (74 కేజీలు), సత్యవ్రత్ కడైన్ (97 కేజీలు), సుమిత్ (125 కేజీలు) చోటు లభించగా, గ్రీక్-రోమన్ విభాగంలో సచిన్ రానా (60 కేజీలు), ఆషు (67 కేజీలు) గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు), దీపాన్షు (97 కేజీలు), నవీన్ కుమార్ (130 కేజీలు)లకు స్థానం దక్కింది.