Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్యాండీ : శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సరికి బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల నష్టానికి 474 పరుగులు చేసింది. రెండో రోజైన గురువారం ఆటను రెండు వికెట్ల నష్టానికి 302 పరుగులతో ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టులో నజ్ముల్ హోసైన్ షాంతో, కెప్టెన్ మోమినుల్ హక్యూ సెంచరీలతో కదం తొక్కారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 242 పరుగులు జోడించింది. మూడో వికెట్‌గా అవుటైన షాంతో 163 పరుగులు (378 బంతుల్లో సిక్స్, 17 ఫోర్లు) చేయగా, హక్యూ 127 పరుగులు (304 బంతుల్లో 11 ఫోర్లు) చేశాడు. గురువారం ఆట ముగిసే సరికి ముషిఫికర్ రహీమ్ 43 పరుగులతో, లిటన్ దాస్ 25 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.