Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హరారే: పాకిస్తాన్‌తో జరిగిన రెండో టి20లో జింబాబ్వే 19 పరుగులు తేడాతో గెలిచింది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టి20లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ కమున్హు(34), ఛకబ్వా(18) మాత్రమే రాణించగా.. మహ్మద్, అజీజ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం పాకిస్తాన్ జట్టు లూక్ జంగ్వే(4/18) దెబ్బకు 19.5 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ అజామ్(41), అజీజ్(22) రాణించినా.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్లు ఘోరంగా విఫలమయ్యారు. మూడు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసిన పాకిస్తాన్ ఆ తర్వాత 21 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోవడం విశేషం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జంగ్వేకు దక్కగా.. మూడు టి20ల సిరీస్‌లో ఇరుజట్లు ఒక్కో మ్యాచ్‌ను గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక మూడో టి20 ఆదివారం జరగనుంది.