Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: పబ్లిక్ రోడ్లపై ఒలింపిక్స్ టార్స్ రిలేను రద్దు చేస్తున్నట్లు టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. తాజాగా టార్చ్ రిలో సభ్యుల్లో ఒకరు కరోనాబారిన పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే జపాన్లోని అన్ని రాష్ట్రాల్లో టార్చ్ రిలే కొనసాగుతుందని, ఒసాకా సిటీ, మట్సుయమతోపాటు మియాకోజిమా ఐస్లాండ్లోని ఒకినావాలోని పబ్లిక్ రోడ్లపై మాత్రమే నిషేధం విధించామని నిర్వాహకులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రష్యా జాతీయ గీతానికి బదులు చైకోవ్క్సీ సంగీతం
రష్యా అథ్లెట్లు స్వర్ణ పతకం సాధిస్తే జాతీయ గీతానికి బదులు చైకోవ్క్సీ సంగీతాన్ని విననున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసి)రష్యాజట్టుపై నిషేధం విధించడంతో ఐఓసి తరఫునే రష్యా అథ్లెట్ల బృందం ఒలింపిక్స్లో పాల్గోనుంది. ఈ క్రమంలో రష్యా తరఫున ఓ అథ్లెట్ స్వర్ణ పతకం గెలిస్తే జాతీయ గీతాన్ని ఆలపించేందుకు అవకాశం లేదు. రష్యాకు చెందిన ప్రముఖ పియానో కాన్సర్టో రూపొందించి సంగీతానికి ఐఓసి ఆమోదం తెలిపింది. దీంతో టోక్యో ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు పతకాలు సాధిస్తే చైకోవ్క్సీ సంగీతాన్ని విననున్నారు.