Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఊరట లభించింది. కరోనా నుంచి కోలుకోవడంతో ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనున్నాడు. కరోనా సోకడంతో దాదాపు మూడు వారాల పాటు ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అక్షర్.. తాజాగా జరిపిన కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఈ మేరకు అక్షర్ జట్టుతో కలిసిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ శుక్రవారం ట్వీట్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.