Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రియల్‌మాడ్రిడ్: యూరోపియన్ సూపర్‌లీగ్(ఇఎస్ఎల్) పూర్తిగా రద్దుకాలేదని, స్టాండ్బైలో ఉందని రియల్ మాడ్రిడ్, న్యూక్యాస్ట్లీ క్లబ్‌లు ప్రకటించాయి. ఈ లీగ్‌లో ఆడతామని ఆమోదం తెలిపిన 12 క్లబ్‌లలో 9క్లబ్‌లు మాత్రమే వైదొలిగాయని, సూపర్ లీగ్ ప్రస్తుతం 'స్టాండ్ బై'లో ఉందని రియల్ మాడ్రిడ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరేజ్ శుక్రవారం తెలిపారు. ఇక న్యూక్యాస్ట్లీ మేనేజర్ స్టీవ్ బ్రూస్ మాట్లాడుతూ.. బ్రిటన్ అధ్యక్షుడు, ఫిఫా ఈ లీగ్‌లో ఆడే ఆటగాళ్లు, క్లబ్‌లపై నిషేధం విధిస్తామని బెదిరింపులకు దిగడంతో ఛెల్సియ, ఆర్సెనల్, లివర్‌పూల్, మాంచెస్టర్ సిటీ, మాంచెస్టర్ యునైటెడ్, టోటెన్హామ్ వైదొలిగాయని, అయినా ఇప్పటికీ లీగ్‌లో ఆడేందుకు మరికొన్ని క్లబ్‌లు ముందుకు వస్తున్నాయని, ప్రేక్షకుల మద్దతు తమకు ఉందని అన్నారు. ఇక సూపర్లీగ్నుంచి వైదొలిగినందుకు మాంచెస్టర్ యునైటెడ్ యాజమాన్యం అభిమానులకు క్షమాపణలు తెలుపడం గమనార్హం.