Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాదేశ్‌తో తొలిటెస్ట్
పల్లెకెలె: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో శ్రీలంక జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోర్ 4వికెట్ల నష్టానికి 474 పరుగులతో శుక్రవారం ఆటను కొనసాగించి బంగ్లాజట్టు 7 వికెట్ల నష్టానికి 541 పరుగులవద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. లింటన్ దాస్(50), రహీమ్(68నాటౌట్) బంగ్లా భారీస్కోర్‌కు దోహదపడ్డారు. అనంతరం శ్రీలంక తొలిఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంకను కెప్టెన్, ఓపెనర్ కరుణరత్నే(85నాటౌట్), తిరిమానే(58) తొలి వికెట్‌కు 114పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం ఫెర్నాండో(20), మాథ్యూస్(25) నిరాశపర్చినా.. డిసిల్వ(26నాటౌట్) రాణించాడు. తస్కిన్, మెహిదీ, తైజుల్‌కు తలా ఒక వికెట్ దక్కాయి.