Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో గెలుపు
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ వృదా
చెన్నై: యువ స్పిన్నర్ రవి బిష్ణోరు గింగిరాలు తిరిగే బంతులకు తోడు, సీనియర్ పేసర్ షమీ బౌలింగ్‌లో చెలరేగడంతో ముంబయిపై 9 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులకే పరిమితం కాగా.. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 132 పరుగులు చేసి గెలిచింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ నమ్మకాన్ని వమ్ము చేయక బౌలర్లు కట్టుదిట్టం చేయడంతో ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్, ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ(63; 52బంతుల్లో.. 5ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీతో బ్యాటింగ్‌లో మెరిసాడు. తొలి రెండు వికెట్లను ముంబయి 26 పరుగులకే కోల్పోయినా.. రోహిత్, సూర్యకుమార్ యాదవ్ కలిసి మూడో వికెట్‌కు 79 పరుగులు జత చేశారు. సూర్యకుమార్ యాదవ్(33; 27బంతుల్లో.. 3ఫోర్లు, సిక్స్) రాణించగా.. ఇషన్ డికాక్ (3), కిషన్(6), హార్దిక్(1), కృనాల్(3) సింగిల్ డిజిట్‌కే ఔట్ కావడంతో ఆ జట్టు భారీస్కోర్‌పై ఆశలు వదులుకుంది. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోరు, మహ్మద్ షమీ చెరో 2 వికెట్లు తీయగా.. దీపక్ హుడా, ఆర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన యువ స్పిన్నర్ రవి బిష్ణోరు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.
లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓపెనర్ అగర్వాల్, కేఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్‌కు 53 పరుగులు జతచేశారు. ఈ క్రమంలో అగర్వాల్ 25 పరుగుల వద్ద రాహుల్ చాహర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ బౌండరీ లైన్‌వద్ద క్యాచ్ అందుకోవడంతో పెవీలియన్‌కు చేరాడు. ఆ తర్వాత గేల్, కేఎల్ రాహుల్ కలి మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. కేఎల్ రాహుల్(60నాటౌట్); 52బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు), గేల్(43నాటౌట్; 35 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) పంజాబ్ కింగ్స్ గెలుపులో కీలకపాత్ర పోషించారు.
స్కోర్‌బోర్డు..
ముంబయి ఇండియన్స్: డికాక్ (సి)హెన్రిక్స్ (బి)హుడా 3, రోహిత్ (సి)అలెన్ (బి)షమీ 63, ఇషన్ కిషన్ (సి)రాహుల్ (బి)బిష్ణోరు 6, సూర్యకుమార్ (సి)గేల్ (బి)బిష్ణోరు 33, పొలార్డ్ (నాటౌట్) 16, హార్దిక్ పాండ్యా (సి)హుడా (బి)ఆర్ష్‌దీప్ సింగ్ 1, కృనాల్ పాండ్యా (సి)పూరన్ (బి)షమీ 3, జయంత్ (నాటౌట్) 0, అదనం 6. (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 131 పరుగులు.
వికెట్ల పతనం: 1/7, 2/26, 3/105, 4/112, 5/122, 6/122, 7/130
బౌలింగ్: హెన్రిక్స్ 3-0-12-0, హుడా 3-0-15-1, షమీ 4-0-21-2, బిష్ణోరు 4-0-21-2, అలెన్ 3-0-30-0, ఆర్ష్‌దీప్ సింగ్ 3-0-28-1.
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 60, అగర్వాల్ (సి)సూర్యకుమార్ (బి)రాహుల్ చాహర్ 25, గేల్ (నాటౌట్) 43, అదనం 4. (17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 132 పరుగులు.
వికెట్ల పతనం: 1/53
బౌలింగ్: బౌల్ట్ 2.4-0-30-0, కృనాల్ పాండ్యా 3-0-31-0, బుమ్రా 3-0-21-0, రాహుల్ చాహర్ 4-0-19-1, జయంత్ యాదవ్ 4-0-20-0, పొలార్డ్ 1-0-11-0