Authorization
Thu March 06, 2025 01:20:29 pm
- ప్రపంచకప్ ఆర్చరీ
గ్వాటిమాల: ప్రపంచకప్ ఆర్చరీ రికర్వు విభాగం ఫైనల్లోకి భారత మహిళల జట్టు ప్రవేశించింది. శుక్రవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో దీపిక కుమారి, అంకిత భగత్, కోమలిక బారిలతో కూడిన భారత మహిళల బృందం 6-0తో స్పెయిన్‌ను చిత్తుచేసింది. ఫైనల్‌కు చేరడంతో భారత మహిళలజట్టుకు కనీసం రజిత పతకం ఖాయంకాగా.. ఆదివారం జరిగే ఫైనల్లో 2వ సీడ్ మెక్సికోతో స్వర్ణ పతకానికి పోటీపడనున్నారు. ఇక హోరాహోరీగా సాగిన పురుషుల విభాగం సెమీస్ పోటీలో భారత జట్టు 26-27 పాయింట్ల తేడాతో స్పెయిన్ చేతిలో ఓడింది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన పురుషుల జట్టు తొలుత 4-4తో టై అవ్వడంతో షూట్-ఆఫ్‌కు దారితీసింది. ఇందులో పురుషుల జట్టు ఒక్క పాయింట్ తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మిక్స్డ్ విభాగం కాంస్య పతక పోరులో అతాను-దీపిక పోటీపడనుండగా.. వ్యక్తిగత విభాగాల్లోనూ నలుగురు భారత ఆర్చర్లు పతకాలకై పోటీపడనున్నారు.