Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్రా దిశగా లంక-బంగ్లా టెస్ట్
పల్లెకెలె: శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లమధ్య జరుగుతున్న తొలి టెస్ట్ డ్రా దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 229 పరుగులతో శనివారం ఆటను కొనసాగించిన శ్రీలంక నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 512 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్మన్లు కెప్టెన్ కరుణరత్నే(234నాటౌట్), ధనుంజయ(154నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. నాల్గోరోజు ఆటలో భాగంగా బంగ్లాదేశ్ బౌలర్లు ఒక్క వికెట్‌ను కూల్చలేకపోయారు. ఇరుజట్లు తొలి ఇన్నింగ్స్‌ను ఇంకా పూర్తి చేయకపోడంతో టెస్ట్ డ్రా అయ్యే అవకాశముంది.