Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో నాదల్ × సిట్సిపాస్
బార్సిలోనా: బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ ఫైనల్లోకి టాప్‌సీడ్, స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్, గ్రీక్‌కు చెందిన 2వ సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ ప్రవేశించారు. శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో సిట్సిపాస్.. ఇటలీకి చెందిన సిన్నర్‌ను, నాదల్ స్పెయిన్‌కే చెందిన కర్రెన్నో బూస్టాను వరుససెట్లలో ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. సిట్సిపాస్ 6-3, 6-3 తేడాతో ఇటలీ టీనేజర్ జన్నిక్ సిన్నర్‌ను వరుససెట్లలో ఓడించాడు. వీరిద్దరూ ఇటీవల ముగిసిన మోంటేకార్లో ఓపెన్ ఫైనల్లో తలపడగా.. సిట్సిపాస్ వరుససెట్లలో సిన్నర్‌ను ఓడించి టైటిల్‌ను నెగ్గిన సంగతి తెలిసిందే. రెండో సెమీస్‌లో నాదల్ 6-3, 6-2తో సహచర ఆటగాడు బూస్టాను ఓడించాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరు సిట్సిపాస్-నాదల్‌ల మధ్య జరగనుంది.