Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెప్టెన్ మిథాలీ రాజ్
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ వేదికగా 2022లో జరిగే వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడడమే తన అంతిమ లక్ష్యమని కెప్టెన్ మిథాలీరాజ్ అన్నారు. '1971: ది బిగినింగ్ ఆఫ్ ఇండియా క్రికెటింగ్ గ్రేట్‌నెస్' బుక్‌ను శనివారం ఆవిష్కరిస్తూ 38ఏళ్ల మిథాలీ వర్చ్యువల్ వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు. హార్పర్ కోలిన్స్ ముద్రించిన పుస్తకానికి బోరియ మజుందర్, గౌతమ్ భట్టాచార్య సహ రచయితలు. మిథాలీ ఇంకా.. గత ఏడాదితో తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం 20ఏళ్ళు పూర్తయిందని, ఫిట్నెస్ కాపాడుకోవడమే తన ముందున్న లక్ష్యమని తెలిపింది. ప్రస్తుత భారతజట్టు అన్ని విభాగాల్లో సమపాళ్లలో ఉందని, 2022 వన్డే ప్రపంచకప్ గెలుపొందడమే తన లక్ష్యమని పేర్కొంది. మానసికంగా, ఫిట్నెస్ను కాపాడుకుంటూ 23ఏళ్ల తన క్రికెట్ ప్రయాణంలో రాబోయే టూర్లలో తప్పక రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత మహిళల వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉన్న మిథాలీరాజ్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 7వేల పరుగులు పూర్తిచేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది.