Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్‌కతాపై 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ గెలుపు
ముంబయి: పేసర్ క్రిస్ మోరిస్ తొలిసారి బౌలింగ్‌లో మెరవడంతో రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో కోల్‌కోతా నైట్‌రైడర్స్‌పై 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులకే పరిమితం కాగా.. అనంతరం రాజస్తాన్ 18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి గెలిచింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు రాజస్తాన్ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(11; 19బంతుల్లో.. ఒక ఫోర్), నితీశ్ రాణా(22; 25బంతుల్లో.. ఫోర్, సిక్సర్) ఆచి తూచి ఆడారు. ఆ క్రమంలో శుభ్‌మన్ గిల్ అనవర పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి(36; 26బంతుల్లో.. ఫోర్, 2సిక్సర్లు) ధాటిగా ఆడినా మిగతా బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. ఇక కీపర్ దినేశ్ కార్తీక్(25; 24బంతుల్లో.. 4ఫోర్లు) పర్వాలేదనిపించినా.. ఆఖరి రెండు ఓవర్లలో మోరిస్ మోత మోగించాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మోరిస్ 4వ బంతికి రస్సెల్‌ను, 6వ బంతికి దినేశ్ కార్తీక్‌కు ఔట్ చేయగా.. 20వ ఓవర్లో కమ్మిన్స్‌ను, ఆఖరి బంతికి శివమ్ మావిని పెవీలియన్‌కు పంపాడు. దీంతో కేకేఆర్ 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. క్రిస్ మోరిస్‌కు నాలుగు, ఉనద్కత్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
అనంతరం రాజస్తాన్ ఓపెనర్ బట్లర్(5), తెవాటియా(5) త్వరగా పెవీలియన్‌కు చేరినా.. జైస్వాల్(22), సంజు(42నాటౌట్), దూబే(22), డేవిడ్ మిల్లర్(24నాటౌట్) భారీషాట్లకు వెళ్లక సింగిల్స్ తీస్తూ మ్యాచ్‌ను ముగించారు. దీంతో రాజస్తాన్ జట్టు ఈ సీజన్లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మోరిస్‌కు దక్కింది.
స్కోర్‌బోర్డు..
కోల్‌కతా నైట్‌రైడర్స్:
నితీష్ రాణా (సి)సంజు (బి)సకారియ 22, శుభ్‌మన్ (రనౌట్) బట్లర్ 11, త్రిపాఠి (సి)రియాన్ (బి)ముస్తఫిజుర్ 36, నరైన్ (సి)జైస్వాల్ (బి)ఉనాద్కట్ 6, మోర్గాన్ (రనౌట్) మోరిస్ 0, దినేశ్ కార్తీక్ (సి)సకారియ (బి)మోరిస్ 25, రస్సెల్ (సి)మిల్లర్ (బి)మోరిస్ 9, కమిన్స్ (సి)రియాన్ (బి)మోరిస్ 10, శివమ్ మావి (బి)మోరిస్ 5, ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0, అదనం 9. (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 133 పరుగులు.
వికెట్ల పతనం: 1/24, 2/45, 3/54, 4/61, 5/94, 6/117, 7/118, 8/133, 9/133
బౌలింగ్: ఉనాద్కట్ 4-0-25-1, సకారియ 4-0-31-1, ముస్తఫిజుర్ 4-0-22-1, మోరిస్ 4-0-23-4, తెవాటియ 3-0-24-0, దూబే 1-0-5-0
రాజస్తాన్ రాయల్స్:
బట్లర్ (ఎల్బి)చక్రవర్తి 5, జైస్వాల్ (సి)సబ్ నాగర్కోటి (బి)శివమ్ మావి 22, సంజు (నాటౌట్) 42, దూబే (సి)ప్రసిధ్ (బి)చక్రవర్తి 22, తెవాటియా (సి)సబ్ నాగర్కోటి (బి)ప్రసిధ్ 5, డేవిడ్ మిల్లర్ (నాటౌట్) 24, అదనం 14. (18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 134 పరుగులు.ఔ
వికెట్ల పతనం: 1/21, 2/40, 3/85, 4/100
బౌలింగ్: శివమ్ మావి 4-0-19-1, కమ్మిన్స్ 3.5-0-36-0, చక్రవర్తి 4-0-32-2, నరైన్ 4-0-20-0, ప్రసిధ్ కృష్ణ 3-0-20-1.