Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్గ్రేడ్(సెర్బియా): బెల్గ్రేడ్ ఓపెన్ టెన్నిస్ సెమీఫైనల్లో టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్ అనూహ్యంగా పరాజయాన్ని చవిచూశాడు. శనివారం రాత్రి జరిగిన సెమీస్ పోటీలో జకోవిచ్ 5-7, 6-4, 4-6తో రష్యాకు చెందిన అస్లన్ కరక్ట్సేవ్ చేతిలో ఓడాడు. ఈ మ్యాచ్‌లో కరక్ట్సేవ్ 28 బ్రేక్ పాయింట్స్ సాధించాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ సెమీస్‌లో కరక్ట్సేవ్ను ఓడించాడు. ఇక మోంటే కార్లో ప్రి క్వార్టర్స్‌లో బ్రిటన్‌కు చెందిన ఇవాన్స్ చేతిలో జకో పరాజయాన్ని చవిచూశాడు. మరో సెమీస్ పోటీలో ఇటలీకి చెందిన 2వ సీడ్ బెర్రెట్టిని 6-1 6-7(5-7), 6-0తో డానియల్(జపాన్)ను చిత్తుచేసి ఫైనల్లోకి ప్రవేశించారు.