Authorization
Thu March 06, 2025 01:29:43 pm
పల్లెకెలె: శ్రీలంక- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలిటెస్ట్ డ్రా అయ్యింది. ఓవర్‌నైట్ స్కోర్ 3వికెట్ల నష్టానికి 512 పరుగులతో ఆదివారం ఆటను కొనసాగించిన శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 648 పరుగులవద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. దీంతో శ్రీలంకకు 107పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించినట్లైంది. కరుణరత్నే(244), ధనుంజయ (166)ను తస్కిన్ అహ్మద్ ఔట్ చేశాడు. తస్కిన్‌ను మూడు, తైజుల్ ఇస్లామ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాజట్టు ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్(74నాటౌట్), మోమినుల్ హక్(23నాటౌట్) రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కరుణరత్నేకు దక్కగా.. రెండో, ఆఖరి టెస్ట్ 29నుంచి ప్రారంభం కానుంది.