Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హరారే: జింబాబ్వేతో జరిగిన మూడు టి20ల సిరీస్ను పాకిస్తాన్ 2-1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మూడో, ఆఖరి టి20లో పాకిస్తాన్ 24 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్ రిజ్వాన్(91నాటౌట్), కెప్టెన్ బాబర్ అజమ్(52) అర్ధసెంచరీలతో రాణించగా.. షర్జీత్ఖాన్(18), ఫకర్ జమాన్(0) నిరాశపరిచారు. జోంగ్వేకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులకే పరిమితమైంది. 13.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 102 పరుగులు చేసిన జింబాబ్వే ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి పరాజయంపాలైంది. ఓపెనర్ మధేవెరా(59), మరుమణి(35) మాత్రమే రాణించారు. హసన్ అలీకి నాలుగు, రవూఫ్కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హసన్ అలీకి దక్కగా.. ఇరుజట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ 29నుంచి ప్రారంభం కానుంది.