Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఖరి ఓవర్లో 37పరుగులు కొట్టి జడ్డూ రికార్డు
- బెంగళూరుపై 69పరుగుల తేడాతో చెన్నై గెలుపు
- కోహ్లీసేనకు తొలి ఓటమి
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఓటమిని నమోదు చేసుకుంది. తొలుత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విధ్వంస ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. లక్ష్య ఛేదనలో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 122 పరుగులకు పరిమితమైంది. దీంతో చెన్నై 69 పరుగులతో విజయం సాధించడమే గాక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఐపిఎల్ చరిత్రలో 20వ ఓవర్లో 37పరుగులు కొట్టి బ్యాట్స్‌మన్‌గా జడేజా రికార్డుపుటల్లోకెక్కాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై ఓపెనర్లు డూప్లెసిస్(50; 41బంతుల్లో.. 5ఫోర్లు, సిక్సర్), గైక్వాడ్(33; 25బంతుల్లో.. 4ఫోర్లు, సిక్సర్) తొలి వికెట్‌కు 74పరుగులు జతచేశారు. ఆ తర్వాత రైనా(24; 18బంతుల్లో.. ఫోర్, 3సిక్సర్లు) తొలుత నెమ్మదిగా ఆడినా.. చివర్లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అంబటి రాయుడు(14) నిరాశపరిచినా.. చివర్లో రవీంద్ర జడేజా(62; 28బంతుల్లో.. 4ఫోర్లు, 5సిక్సర్లు) బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఏకంగా 37 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో వరుసగా నాలుగు సిక్సర్లు బాదినా.. ఆ తర్వాతి బంతికి 2 పరుగులు తీశాడు. నోబాల్ వేసిన ఓ బంతిని సిక్సర్‌గా మలిచినా.. ఆఖరి రెండు బంతులను సిక్సర్, ఫోర్ బాదడంతో ఆ ఓవర్లో ఏకంగా 37 పరుగులు వచ్చాయి. దీంతో చెన్నై 20ఓవర్లలో 4వికెట్లకు 191పరుగులు చేసింది. హర్షర్ పటేల్ మూడు, చాహల్‌కు ఒక వికెట్ దక్కాయి. లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టులో ఓపెనర్ పడిక్కల్(34), మ్యాక్స్‌వెల్, 22, జెమీసన్(16) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్మన్లంతా ఘోరంగా విఫలమయ్యారు. జడేజాకు మూడు, తాహిర్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జడేజాకు దక్కింది.
చెన్నై సూపర్‌కింగ్స్: గైక్వాడ్ (సి)జెమీసన్ (బి)చాహల్ 33, డుప్లెసిస్ (సి)క్రిస్టియన్ (బి)హర్షల్ పటేల్ 50, రైనా (సి)పడిక్కల్ (బి)హర్షల్ పటేల్ 24, రాయుడు (సి)జెమీసన్ (బి)హర్షల్ పటేల్ 14, జడేజా (నాటౌట్) 62, ధోనీ (నాటౌట్) 2, అదనం 6. (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 191 పరుగులు.
వికెట్ల పతనం: 1/74, 2/111, 3/111, 4/142
బౌలింగ్: సిరాజ్ 4-0-32-0, జెమీసన్ 3-0-31-0, చాహల్ 3-0-24-1, సైనీ 2-0-27-0, హర్షల్ పటేల్ 4-0-51-3, క్రిస్టియన్ 2-0-12-0, సుందర్ 2-0-13-0.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (సి)ధోనీ (బి)శామ్ కర్రన్ 8, పడిక్కల్ (సి)రైనా (బి)శార్దూల్ 34, సుందర్ (సి)గైక్వాడ్ (బి)జడేజా 7, మ్యాక్స్‌వెల్ (బి)జడేజా 22, డివిలియర్స్ (బి)జడేజా 4, క్రిస్టియన్ (రనౌట్) జడేజా 1, జేమీసన్ (రనౌట్) తాహిర్ 16, హర్షల్ పటేల్ (బి)తాహిర్ 0, సైనీ (సి)రైనా (బి)తాహిర్ 2, చాహల్ (నాటౌట్) 8, సిరాజ్ (నాటౌట్) 12. అదనం 8. (20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 122 పరుగులు.
వికెట్ల పతనం: 1/44, 2/54, 3/65, 4/79, 5/81, 6/83, 7/89, 8/94, 9/103,
బౌలింగ్: దీపక్ చాహర్ 2-0-25-0, శామ్ కర్రన్ 4-0-35-1, శార్దూల్ 4-0-11-1, జడేజా 4-1-13-3, తాహిర్ 4-0-16-2, బ్రేవో 2-0-19-0.