Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూపర్ ఓవర్లో హైదరాబాద్‌పై ఢిల్లీ గెలుపు
చెన్నై: ఐపీఎల్ సీజన్-14లో తొలిసారి ఓ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఆదివారం హైదరాబాద్-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన హోరాహోరీగా సాగిన మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో ఢిల్లీజట్టు సన్‌రైజర్స్ నిర్దేశించిన 8 పరుగుల ఛేదించి గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. అనంతరం సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌కు అదిరిపోయే ఆరంభం దక్కినా.. చివర్లో వేగంగా పరుగులు చేయలేకపోయింది. ఓపెనర్ పృథ్వీ షా(53; 39బంతుల్లో.. 7ఫోర్లు, సిక్సర్), శిఖర్ ధావన్(28; 26బంతుల్లో.. 3ఫోర్లు) చక్కటి ఆరంభాన్నివ్వడంతో 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 80 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత వరుస ఓవర్లలో శిఖర్ ధావన్, షా అవుట్ కావడంతో ఢిల్లీ స్కోరు వేగం తగ్గింది. పంత్(28; 26బంతుల్లో.. 3ఫోర్లు), స్టీవ్ స్మిత్(34నాటౌట్; 25బంతుల్లో.. 3ఫోర్లు, సిక్సర్) వేగంగా పరుగులు చేయలేకపోయారు. దీంతో ఢిల్లీ 20ఓవర్లో 159 పరుగులే చేయగల్గింది. సన్‌రైజర్స్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం హైదరాబాద్ చివరివరకు పోరాడి 159 పరుగులు చేయగల్గింది. బెయిర్‌స్టో 38, విలియమ్సన్(66నాటౌట్) రాణించారు. యువ క్రికెటర్ సుచిత్ ఆఖరి ఓవర్లో సిక్సర్ కొట్టి ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అక్షర్‌కు రెండు, ఆవేశ్‌ఖాన్‌కు మూడు వికెట్లు దక్కాయి.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (రనౌట్) ఖలీల్/సుచిత్ 53, ధావన్ (బి)రషీద్ 28, పంత్ (సి)సుచిత్ (బి)కౌల్ 37, స్మిత్ (నాటౌట్) 34, హెట్మెయిర్ (సి)విలియమ్సన్ (బి)కౌల్ 1, స్టోయినీస్ (నాటౌట్) 2, అదనం 4. (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 159 పరుగులు.
వికెట్ల పతనం: 1/81, 2/84, 3/142, 4/145
బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4-0-42-0, అభిషేక్ శర్మ 1-0-14-0, సిద్ధార్ద్ కౌల్ 4-0-31-2, సుచిత్ 4-0-21-0, విజరు శంకర్ 3-0-19-0, రషీద్ ఖాన్ 4-0-31-1.
సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (రనౌట్) రబాడ/పంత్ 6, బెయిర్‌స్టో (సి)ధావన్ (బి)అవేశ్ ఖాన్ 38, విలియమ్సన్ (నాటౌట్) 66, విరాట్ సింగ్ (సి)స్టోయినీస్ (బి)ఆవేశ్ ఖాన్ 4, కేదర్ జాదవ్ (స్టంప్) పంత్ (బి)మిశ్రా 9, అభిషేక్ శర్మ (ఎల్బి) అక్షర్ 5, రషీద్ ఖాన్ (ఎల్బి) అక్షర్ 0, విజరు శంకర్ (బి) ఆవేశ్ ఖాన్ 8, సుచిత్ (నాటౌట్) 14, అదనం 9. (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 159పరుగులు.
వికెట్ల పతనం: 1/28, 2/56, 3/84, 4/104, 5/117, 6/117, 7/136
బౌలింగ్: రబాడ 3-0-25-0, అశ్విన్ 4-0-27-0, స్టోయినీస్ 1-0-12-0, అక్షర్ పటేల్ 4-0-26-2, ఆవేశ్ ఖాన్ 4-0-34-3, అమిత్ మిశ్రా 4-0-31-1.