Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: అథ్లెట్లకు సేవలందించడానికి 500మంది నర్సులను నియమించనున్నట్లు టోక్యో ఒలింపిక్స్ కమిటీ సిఇవో తొషిరో మోటో తెలిపారు. స్థానిక మీడియాతో సోమవారం మోటో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఒలింపిక్ క్రీడలు జరిగే ప్రదేశాల్లో భారీసంఖ్యలో నర్సులను నియమించనున్నట్లు తెలిపారు. వీరంతా ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లు, గ్రామాలకు దగ్గర్లో ఉంటారన్నారు. దీనికి కంట్రీ నర్సింగ్ అసోసియేషన్ ఆమోదం కూడా తెలిపిందని నిర్వాహకులు పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్ ఈ ఏడాది జులై 23నుంచి ఆగస్టు 8వరకు జరగనుండగా.. వీరంతా ఇప్పటినుంచి స్థానిక అథ్లెట్లకు అందుబాటులో ఉంటారని, వీరి సేవలను అథ్లెట్లు వినియోగించుకోవాలని మోటో మీడియాతో తెలిపారు.