Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్ తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ సరఫరా కోసం 50వేల డాలర్లు (సుమారు రూ.37లక్షలు) పిఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ప్రకటించాడు. అలాగే ఐపిఎల్‌లో సహచర ఆటగాళ్లు కూడా విరాళం ఇవ్వాల్సిందిగా కోరాడు. 'ఇండియాకు రావడాన్నికి తాను ఇష్టపడతానని, ఇక్కడి వాళ్లు చాలా మంచి వాళ్లు. కానీ ఈసారి పరిస్థితులు ఇంత దారుణంగా ఉండటం నన్ను ఎంతగానో బాధపెడుతోంది' అని కమిన్స్ ఓ ప్రకటనలో తెలిపాడు.