Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు చోటు దక్కింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిస్తోంది. టి20 ఫార్మాట్లో జరగనున్న టోర్నీలో 2022 ఏప్రిల్1 నాటికి ఐసిసి ర్యాంకింగ్స్‌లో తొలి 7స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా కామన్వెల్త్కు అర్హత సాధించనున్నాయి. మరోస్థానం కోసం కరేబియన్ దీవుల్లో జరిగే అర్హత టోరీ నుంచి ఓ జట్టు రానుంది. మొత్తం ఎనిమిది జట్ల మధ్య మాత్రమే ఈ మెగాటోర్నీ జరగనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి), కామన్వెల్స్ గేమ్స్ ఫెడరేషన్(సిజిఎఫ్) సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. 1998 కౌలాలంపూర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి పురుషుల క్రికెట్‌కు చోటు దక్కింది. వన్డే ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నమెంట్లో స్వర్ణ పతకాన్ని దక్షిణాఫ్రికా జట్టు గెల్చుకుంది. కామన్వెల్త్గేమ్స్లో క్రికెట్‌కు చోటు దక్కించుకోవడం ఇది రెండోసారి మాత్రమే. గత ఏడాది జరిగిన ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెల్చుకుంది. 22వ కామన్వెల్త్ గేమ్స్ 2022 జులై 28-ఆగస్టు 8వరకు ఇంగ్లండ్‌లో జరగనుండగా..