Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విరామం తీసుకుంటున్నా: అశ్విన్
-రాజస్తాన్, ఆర్సీబీనుంచి ఇద్దరేసి నిష్క్రమణ
న్యూఢిల్లీ: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐపిఎల్‌నుంచి ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తోపాటు రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల విదేశీ ఆటగాళ్లు లీగ్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు సోమవారం తెలిపారు. 'నా కుటుంబసభ్యులు కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. కాబట్టి ఈ కష్టకాలంలో నేను వారికి అండగా ఉండాలనుకుంటున్నాను. అందుకే ఐపిఎల్‌నుంచి విరామం పలుకుతున్నాను. ఒకవేళ పరిస్థితులు కుదుటపడితే మళ్లీ ఆడేందుకు తిరిగొస్తా.. ధన్యవాదాలు' అని అశ్విన్ ఆ ట్వీట్ చేశాడు. ఇక రాజస్తాన్‌కు చెందిన లివింగ్ స్టోన్ బయోబబుల్ నిబంధనలను తట్టుకోలేక ముందే ఐపిఎల్‌కు దూరం కాగా.. ఆండ్రూ టై మాత్రం వ్యక్తిగత కారణాలతో ఐపిఎల్‌ను వైదొలుగుతున్నట్లు తెలిపాడు. ఇక ఆర్సీబికి చెందిన కేన్ రిచర్డుసన్, ఆడం జంపా ఈ సీజన్ ఐపిఎల్‌కు దూరంగా ఉంటామని తాజాగా ఆయా ఫ్రాంచైజీలకు తెలిపారు. 'ఆటగాళ్ల నిర్ణయాలను గౌరవిస్తున్నాం' అని ఫ్రాంచైజీలు ట్విట్టర్వేదికగా స్పందించాయి. ఇక భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) తాజా పరిస్థితిపై స్పందిస్తూ.. 'ఐపిఎల్ లీగ్ కొనసాగుతుంది. ఎవరైనా లీగ్‌నుంచి తప్పుకోవాలనుకుంటే మంచిదే' అని స్పష్టం చేసింది.