Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ కింగ్స్ 5వికెట్ల తేడాతో విజయం
అహ్మదాబాద్: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-14లో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండో విజయాన్ని సాధించింది. సోమవారం పంజాబ్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ల దెబ్బకు పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డా.. త్రిపాఠి, మోర్గాన్ కలిసి నాల్గో వికెట్‌కు 66 పరుగులు జతచేసి మ్యాచ్‌ను గెలుపుదిశగా తీసుకెళ్లారు. మోర్గార్(47నాటౌట్) చివరివరకు క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడడంతో కోల్‌కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసి గెలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్(19)ను కమ్మిన్స్ ఔట్ చేశాడు. ఆ తర్వాత అగర్వాల్(31) ఫర్వాలేదనిపించినా.. గేల్, హుడా ఘోరంగా విఫలం కావడంతో పంజాబ్ 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లే 6 ఓవర్లలో కేవలం 37 పరుగులే చేయగల్గింది. ఆ తర్వాత నరైన్, ప్రసిధ్ కృష్ణ, కమ్మిన్స్ చెలరేగడంతో ఓ దశలో 95 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కేకేఆర్ బౌలర్ల ధాటికి పంజాబ్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఒక దశలో వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఆ దశలో లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ జోర్డాన్(30; 18 బంతుల్లో ఫోర్, 3సిక్సర్లు) రాణించడంతో ఆమాత్రమైనా స్కోర్ చేయగల్గింది. అహ్మదాబాద్ పిచ్ బౌలర్లకు సహకరించడంతో పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణకు మూడు, కమిన్స్, నరైన్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి. అనంతరం కోల్‌కతా ఓపెనర్ నితీష్(0), శుభ్‌మన్(9), నరైన్(0) ఘోరంగా విఫలం కావడంతో కోతాకతా 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత త్రిపాఠి(41), మోర్గాన్ రాణించారు. చివర్లో రస్సెల్(10) త్వరగా ఔటైనా.. దినేశ్ కార్తీక్(12నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు. హెన్రిక్, షమీ, ఆర్ష్‌దీప్, హుడాకు తలా ఒక వికెట్ దక్కాయి. చెన్నై, ముంబయిలలో ఐపిఎల్ మ్యాచ్‌లు ముగియడంతో రెండోసెషన్ మ్యాచ్‌లు అహ్మదాబాద్, ఢిల్లీ వేదికల్లో జరగనున్నాయి.
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (సి)నరైన్ (బి)కమ్మిన్స్ 19, అగర్వాల్ (సి)త్రిపాఠి (బి)నరైన్ 31, గేల్ (సి)కార్తీక్ (బి)శివమ్ మావి 0, దీపక్ హుడా (సి)మోర్గాన్ (బి)ప్రసిధ్ 1, పూరన్ (బి)చక్రవర్తి 19, హెన్రిక్స్ (బి)నరైన్ 2, షారుక్ ఖాన్ (సి)మోర్గాన్ (బి)ప్రసిధ్ 13, జోర్డాన్ (బి)ప్రసిధ్ 30, రవి బిష్ణోరు (సి)మోర్గాన్ (బి)కమ్మిన్స్ 1, షమీ (నాటౌట్) 1, ఆర్ష్‌దీప్ సింగ్ 1, అదనం 5. (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 123 పరుగులు.
వికెట్ల పతనం: 1/36, 2/38, 3/42, 4/60, 5/75, 6/79, 7/95, 8/98, 9/121.
బౌలింగ్: శివమ్ మావి 4-0-13-1, కమ్మిన్స్ 3-0-31-2, నరైన్ 4-0-22-2, ప్రసిధ్ 4-0-30-3, రస్సెల్ 1-0-2-0, చక్రవర్తి 4-0-24-1.
కోల్‌కతా నైట్‌రైడర్స్: శుభ్‌మన్ (ఎల్బి)షమీ 9, నితీష్ రాణా (సి)షారుక్ (బి)హెన్రిక్స్ 0, త్రిపాఠి (సి)షారుక్ (బి)హుడా 41, నరైన్ (సి)రవి బిష్ణోరు (బి)ఆర్ష్‌దీప్ సింగ్ 0, మోర్గాన్ (నాటౌట్) 47, రస్సెల్ (రనౌట్) ఆర్ష్‌దీప్ సింగ్ 10, దినేశ్ కార్తీక్ (నాటౌట్) 8, అదనం 7. (16.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 126 పరుగులు.
వికెట్ల పతనం: 1/5, 2/9, 3/17, 4/83, 5/98
బౌలింగ్: హెన్రిక్స్ 1-0-5-1, షమీ 4-0-25-1, ఆర్ష్‌దీప్ సింగ్ 2.4-0-27-1, రవి బిష్ణోరు 4-0-19-0, జోర్డాన్ 3-0-24-0, హుడా 2-0-20-1.