Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: మోకాలి గాయంతో ఐపిఎల్ టోర్నీకి దూరమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, చెన్నైకు చెందిన టి. నటరాజన్‌కు శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని నటరాజన్ తన ట్విటర్లో మంగళవారం వెల్లడించాడు. 'ఈరోజు నా మోకాలి సర్జరీ విజయవంతమైంది. సర్జరీలో భాగమైన నిపుణులు, మెడికల్ టీమ్, సర్జన్స్, డాక్టర్లు, నర్సులు, మిగతా స్టాఫ్‌కు కృతజ్ఞతలు'అని తెలిపాడు. ఇక బిసిసిఐ స్పందిస్తూ.. 'నువ్వు త్వరగా కోలుకోవాలి. మళ్లీ ఫీల్డ్‌లో చూడాలని కోరుకుంటున్నాం' అని ట్వీట్ చేసింది. ఐపిఎల్ టోర్నీలో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నటరాజన్ మోకాలికి తీవ్రగాయమైంది.
భారతమహిళా హాకీ టీమ్‌కు పాజిటివ్
బెంగళూరు: భారత్హాకీ టీమ్ కెప్టెన్ రాణి రామ్‌పాల్ సహ మరో ఏడుగురు సహసభ్యులకు కరోనా సోకినట్టు తేలింది. బెంగళూరులోని భారతీయ ఖేల్ ప్రాధీకరణ్(ఎస్ఏఐ)లో ప్రారంభంకానున్న శిక్షణకు ముందు క్రీడాకారులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా కరోనా బారినపడినట్టు పరీక్షల్లో గుర్తించారు.