Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశీ ఆటగాళ్లకు బిసిసిఐ భరోసా
ముంబయి: విదేశీ ఆటగాళ్లు క్షేమంగా స్వస్థలాలకు వెళ్లేంతవరకు తమదే బాధ్యత అని, ఈ విషయంలో ఆటగాళ్ళెవ్వరూ భయపడొద్దని బిసిసిఐ మంగళవారం స్పష్టం చేసింది. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాకు ప్రయాణికుల వెళ్ళే విమానా సర్వీసులపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. మే 15వరకు ఈ నిషేధం కొనసాగనుంది. దాంతో రాబోయే రోజుల్లో పరిస్థితి విషమిస్తే అంతర్జాతీయ ప్రయాణాలపై మరింత ప్రభావం ఉండొచ్చనే సందేహం ఐపిఎల్‌లో ఆడే విదేశీల ఆటగాళ్లలో నెలకొంది. ఈ నేపథ్యంలో బిసిసిఐ స్పందిస్తూ.. విదేశీ ఆటగాళ్లు తిరిగి స్వస్థలాలకు చేరేవరకు బిసిసిఐదే బాధ్యత అని హేమంగ్ అమిన్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 'ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఐపిఎల్ పూర్తయ్యాక తిరిగి స్వదేశాలకు ఎలా వెళ్లాలనే విషయంపై విదేశీ ఆటగాళ్ళు భయపడుతున్నారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, క్షేమంగా ఇళ్లకు చేరేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు బిసిసిఐ చేపడుతుంది' అని హేమంగ్ అన్నారు.
సొంత ఏర్పాట్లు చేసుకోవాలి: ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్
ఐపిఎల్‌నుంచి తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్ళే ఆటగాళ్ళ విషయమై ఆ దేశ ప్రధాని మోరిసన్ మంగళవారం స్పందించారు. ఐపిఎల్‌లో ఆడేందుకు వెళ్ళిన క్రికెటర్లంతా ప్రైవేట్‌గా ప్రయాణించారని, ఇదేమి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటనలో భాగం కాదని, వారంతా సొంత ఏర్పాట్లు చేసుకోవాల్సిందేనని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ తెలిపారు. ఐపిఎల్ ముగిసాక ఆసీస్ క్రికెటర్లు తిరిగి వెళ్ళేందుకు ప్రత్యేక జెట్ విమానం పంపాలని క్రిస్ లిన్ కోరిన నేపథ్యంలో ప్రధాని పైవిధంగా స్పందించారు. ఆసీస్ క్రికెటర్లు ఎవ్వరికీ తిరిగి స్వదేశానికి చేర్చే క్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయలేమని కుండబద్దలు కొట్టారు. ఐపిఎల్‌లో 14మంది ఆసీస్ ఆటగాళ్లు ప్రస్తుతం ఆడుతున్న విషయం తెలిసిందే.