Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్కంఠ పోరులో ఢిల్లీపై బెంగళూరు గెలుపు
అహ్మదాబాద్: అహ్మదాబాద్: చివరిబంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఐపిఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది. తొలుత ఏబీ డివిలియర్స్(75నాటౌట్; 42 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) విధ్వంస ఇన్నింగ్స్ ఆడడంతో ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఢిల్లీ చివరిబంతి వరకు పోరాడి 170 పరుగులే చేయగల్గింది. చివరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సిన ఢిల్లీ.. సిరాజ్ వేసిన ఓవర్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేయడంతో బెంగళూరు గెలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డివిలియర్స్‌కు దక్కింది.
టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఓపెనర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ(12), దేవ్‌దత్ పడిక్కల్(17) విఫలమయ్యారు. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కు 30 పరుగులు జోడించి వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. నాలుగో ఓవర్ చివరి బంతికి కోహ్లీని.. ఆవేశ్ ఖాన్ బౌల్డ్ చేయగా మరుసటి ఓవర్ తొలి బంతికే దేవ్‌దత్‌ను.. ఇషాంత్ బౌల్డ్ చేశాడు. దాంతో బెంగళూరు ఓపెనర్లు ఇద్దరినీ పవర్‌ప్లే ఓవర్లలోపే కోల్పోయింది. అయితే, ధాటిగా ఆడే క్రమంలో మాక్స్వెల్ ఔట్ కాగా.. రజత్(31) ఫర్వాలేదనిపించాడు. ఇక వాషింగ్టన్ సుందర్(6) నిశాపర్చినా.. స్టోయినిస్ వేసిన చివరి ఓవర్లో డివిలియర్స్ మూడు సిక్సర్లు బాది 23పరుగులు రాబట్టాడు. శామ్స్(3నాటౌట్)గా నిలవడంతో బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్, రబాడ, ఆవేశ్ ఖాన్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్‌కు తలా ఓ వికెట్ దక్కాయి. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ పృథ్వీ షా(21) రాణించినా.. ధావన్(6), స్మిత్(4) ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత స్టోయినీస్(22) రాణించినా లక్ష్యం భారీగా పెరిగింది. దీంతో ఢిల్లీ 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసి విజయానికి దూరంలో నిలిచింది. ఈ క్రమంలో హెట్మెయిర్(53నాటౌట్), పంత్(58నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ 18వ ఓవర్లో 21 పరుగులు, 19వ ఓవర్లో 11పరుగులు రాబట్టారు. ఇక 20ఓవర్లో 14 పరుగులు చేయాల్సిన దశలో యార్కర్ కింగ్, హైదరాబాద్ పేసర్ సిరాజ్ కేవలం 12 పరుగులే ఇవ్వడంతో బెంగళూరు గెలిచింది.
ఐదువేల పరుగులు పూర్తి
ఏబీ డీవిలయర్స్ ఐపీఎల్లో ఐదువేల పరుగులు పూర్తిచేశాడు. ఈ ఫీట్ సాధించిన ఆరో ఆటగాడిగా పేరు నమోదైంది. అంతకుముందు విరాట్ కోహ్లి,సురేశ్ రైనా (3620 బంతులు), శిఖర్‌ధావన్, డెవిడ్ వార్నర్(3620 బంతులు)లు ఉంటే..175 మ్యాచ్‌లో 5053 పరుగులు సాధించాడు. అయితే డివిలయర్స్ తక్కువబంతుల్లో(3288) ఐదువేల మైలురాయిని అధిగమించాడు.
స్కోర్‌బోర్డు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (బి)ఆవేశ్ ఖాన్ 12, పడిక్కల్ (బి)ఇషాంత్ 17, రజత్ పటీదర్ (సి)స్మిత్ (బి)అక్షర్ 31, మ్యాక్స్‌వెల్ (సి)స్మిత్ (బి)మిశ్రా 25, డివిలియర్స్ (నాటౌట్) 75, సుందర్ (సి అండ్ బి)రబాడ 6, డానియేల్ శ్యామ్స్ (నాటౌట్) 3, (అదనం 2. (20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి) 171 పరుగులు.
వికెట్ల పతనం: 1/30, 230, 3/60, 4/114, 5/139.
బౌలింగ్: ఇషాంత్ 4-1-26-1, రబాడ 4-0-38-1, ఆవేశ్ ఖాన్ 4-0-24-1, అమిత్ మిశ్రా 3-0-27-1, అక్షర్ పటేల్ 4-0-33-1, స్టోయినీస్ 1-0-23-0
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా (సి)డివిలియర్స్ (బి)హర్షల్ పటేల్ 21, ధావన్ (సి)చాహల్ (బి)జెమీసన్ 6, స్మిత్ (సి)డివిలియర్స్ (బి)సిరాజ్ 4, పంత్ (నాటౌట్) 58, స్టోయినీస్ (సి)డివిలియర్స్ (బి)హర్షల్ పటేల్ 22, హెట్మెయిర్ (నాటౌట్) 53, అదనం 6. (20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 170 పరుగులు.
వికెట్ల పతనం: 1/23, 2/28, 3/47, 4/92
బౌలింగ్: డానియేల్ శ్యామ్స్ 2-0-15-0, సిరాజ్ 4-0-44-1, జెమీసన్ 4-0-32-1, సుందర్ 4-0-28-0, హర్షల్ పటేల్ 4-0-37-2, చాహల్ 2-0-10-0.