Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో: శ్రీలంక మాజీ పేసర్, కోచ్ నువాన్ జోయ్సాపై అంతర్జాతీయ క్రికెట్మండలి(ఐసిసి) ఆరేళ్ల నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు గాను జోయ్సాను అన్నిరకాల ఫార్మాట్లకు దూరంగా ఉండాలని ఐసిసి బుధవారం ప్రకటించింది. గతంలోనే అవినీతి ఆరోపణలతో సస్పెండైన జోయ్సాపై నిషేధం 31 అక్టోబరు 2018 నుంచి అమల్లోకి రానుంది. జోయ్సాపై మూడు అవినీతి అభియోగాలు నిజమని తేలడంతో ఐసిసి ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ జట్టుకు కోచ్గా ఉన్న జోయ్సా అవినీతికి పాల్పడేందుకు చేతులు కలపడమే కాకుండా, పలువురిని ఇందులో దించేందుకు ప్రయత్నించాడని ఐసిసి జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ బుధవారం తెలిపారు. 42ఏళ్ల జోయ్సా శ్రీలంక తరఫున 95 వన్డేలు, 30టెస్టుల్లో 172 వికెట్లు తీసుకున్నాడు