Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: ఒలింపిక్స్‌కు స్వదేశీ ప్రేక్షకుల అనుమతి, ఎంతమందికి అవకాశం ఇవ్వాలనే విషయం జూన్‌లోనే తేలనుందని నిర్వాహకులు బుధవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో స్వదేశీ ప్రేక్షకులు ఎంతమందికి అవకాశం ఇవ్వాలనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అలాగే ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్య వహించే ప్రతి ఒక్క అథ్లెట్ నాలుగు రోజులకొకసారి కరోనా టెస్ట్‌లకు హాజరుకావాల్సి ఉంటుందని, కోవిడ్-19 రూల్స్‌ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనన్నారు. ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం టోక్యో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అత్యవసర సేవలకు మినహా.. లాక్డౌన్ కొనసాగుతుందని, ఇక ఒలింపిక్స్‌లో విదేశీ ప్రేక్షకులకు అనుమతిని టోక్యో ఒలింపిక్స్ కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ ఇప్పటికే రద్దు చేసిన సంగతి తెలిసిందే.