Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఐపిఎల్ సందర్భంగా జరిగే 'మహిళల టి20 ఛాలెంజ్' ఈసారి జరగడం కష్టంగానే కనబడుతోంది. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇతర దేశాలనుంచి వచ్చే విమానాలపై ప్రయాణ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఇందులో ఆడే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మహిళా క్రికెటర్లు భారత్ రావడానికి అవకాశం లేకుండాపోయింది. 'ఇప్పటికిప్పుడు భారత అమ్మాయిల్ని క్వారంటైన్లో ఉంచడం పెద్ద సమస్య కాదు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశీ క్రికెటర్లు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపడంలేదు. పరిస్థితులు మెరుగయ్యాక తగిన సమయాన్ని చూసి ఈ టోర్నీని నిర్వహిస్తాం' అని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. సుపర్నోవాస్, వెలాసిటీ, ట్రయల్‌బ్లేజర్స్ జట్లు టోర్నీలో తలపడనుండగా.. యుఏఇ వేదికగా గత ఏడాది జరిగిన టోర్నమెంట్లో ట్రయల్ బ్లేజర్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.