Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీి టీి20 ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం విడుదల చేసిన టి20 బ్యాట్స్మన్ల జాబితాలో విరాట్ కోహ్లి 5వ స్థానంలో నిలిచాడు. ఐసిసి ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ భారత్‌కే చెందిన కేఎల్ రాహుల్ 7వ ర్యాంక్‌లో నిలువగా.. పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ టాప్-10లో తొలిసారి చోటు దక్కించుకున్నాడు. 28ఏళ్ల పాకిస్తాన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిజ్వాన్.. జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్‌లో తొలి రెండు టి20లో 82, 91 పరుగులతో సత్తా చాటాడు. ఇక భారత్‌కు చెందిన రోహిత్ శర్మ.. ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్‌ను వెనక్కి నెట్టి 7వ స్థానంలో నిలిచాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ 3వ ర్యాంక్‌లో ఉండగా.. ఇంగ్లండ్‌కు చెందిన మలన్(892పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియాకు చెందిన అరోన్ ఫించ్(830పాయింట్లు) రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక భారత్‌నుంచి టాప్-10లో బౌలర్లుగానీ, ఆల్రౌండర్లుగానీ చోటు దక్కించుకోలేకపోయారు.