Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్లతో గెలుపు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-14లో చెన్నై సూపర్ కింగ్స్ హవా కొనసాగుతోంది. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత సన్‌రైజర్స్ కెప్టెన్ వార్నర్, మనీష్ అర్ధసెంచరీలతో రాణించడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై ఓపెనర్లు గైక్వాడ్(75), డుప్లెసిస్(56) అర్ధసెంచరీలతో కదం తొక్కడంతో 13ఓవర్లలోనే 129 పరుగులు చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ వెంట వెంటనే ఔటైనా.. జడేజా, రైనా నిలదొక్కుకోవడంతో చెన్నై 18.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి గెలిచింది. దీంతో చెన్నై మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే జానీ బెయిర్‌స్టో(7) భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. బెయిర్‌స్టో త్వరగా పెవిలియన్ చేరడంతో మనీష్, వార్నర్ భారీషాట్లకు పోకుండా ఆచితూచి ఆడారు. దీంతో పవర్‌ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 39పరుగులు మాత్రమే చేయగల్గింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 106పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ 17 ఓవర్లవరకు వీరిద్దరూ క్రీజ్‌లో ఉన్నా భారీ స్కోర్ చేయలేకపోయారు. అర్ధశతకాలు పూర్తైన తర్వాత వేగంగా ఆడే క్రమంలో వీరిద్దరూ వికెట్లు చేజార్చుకున్నారు. ఆఖరి దశలో క్రీజ్‌లోకి వచ్చిన కేన్ విలియమ్సన్(26నాటౌట్; 10బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్) మెరుపులు మెరిపించాడు. దీంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శార్దుల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో విలియమ్సన్ 4, 6, 4, 4బాది 20పరుగులు రాబట్టాడు. కర్రన్ వేసిన చివరి ఓవర్లో జాదవ్ 4, 6 కొట్టడంతో జట్టు స్కోరు 170దాటింది.
స్కోర్ బోర్డు..
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (సి)జడేజా (బి)ఎన్గిడి 57, బెయిర్‌స్టో (సి)దీపక్ చాహర్ (బి)శామ్ కర్రన్ 7, మనీష్ పాండే (సి)డుప్లెసిస్ (బి)ఎన్గిడి 61, విలియమ్సన్ (నాటౌట్) 26, కేదర్ జాదవ్ (నాటౌట్) 12. అదనం 8. (20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 171 పరుగులు. వికెట్ల పతనం: 1/22, 2/128, 3/134 బౌలింగ్: దీపక్ చాహర్ 3-0-21-0, శామ్ కర్రన్ 4-0-30-1, శార్దూల్ 4-0-44-0, మొయిన్ అలీ 2-0-16-0, ఎన్గిడి 4-0-35-2, జడేజా 3-0-23-0.
చెన్నై సూపర్‌కింగ్స్: గైక్వాడ్(బి) రషీద్ 75, డుప్లెసిస్ (ఎల్బి) రషీద్ 56, మొయిన్ అలీ (సి)కేదర్ జాదవ్ (బి)రషీద్ 15, జడేజా(నాటౌట్) 7, రైనా(నాటౌట్) 17, అదనం 3. (18.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 173 పరుగులు. వికెట్ల పతనం: 1/129, 2/148, 3/148 బౌలింగ్: సందీప్ శర్మ 3.3-0-24-0, ఖలీల్ 4-0-36-0, కౌల్ 4-0-32-0, సుచిత్ 3-0-45-0, రషీద్ 4-0-36-3.