Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్జట్టు హెడ్‌కోచ్ పదవికి ఐదుగురు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ చీఫ్ సెలెక్టర్ హేమలతతోపాటు మమత మబెన్, జయశర్మ, సుమన్ శర్మ, నూషన్ అల్ ఖదీర్ దరఖాస్తు చేసుకున్న మిగిలిన అభ్యర్థులు. డబ్ల్యువి రామన్ పదవీ కాలం ముగియడంతో హెడ్ కోచ్ పదవికి బిసిసిఐ దరఖాస్తులను ఆహ్వానించింది. రామన్ తిరిగి రెండోసారి ఆ పదవిలో కొనసాగేందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా.. స్వదేశంలో దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత మహిళలజట్టు కోల్పోవడంతో కోచ్ పదవికి ప్రాధాన్యత సంతరించుకుంది. రామన్‌తో పాటు రమేష్ పొవార్, తుషార్ అరోథే కూడా కోచ్ రేసు పదవిలో ఉన్నారు. మదన్‌లాల్ నేతృత్వంలోనే క్రికెట్ అడ్వైజరీ కమిటీ మహిళల హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించగా.. దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 26.